Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు…అసలు రహస్యమేమిటి ….!

అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు…అసలు రహస్యమేమిటి ….!
గుజరాత్ తుఫాన్ కారణమా …లేక జనం సమీకరణ సమస్య నా …?
ఖమ్మం సభకు ఏర్పాట్లలో నిమగ్నమైన నేతలకు నిరాశ
ప్రజలకు సమీకరణకు సిద్దమైన పొంగులేటి సుధాకర్ రెడ్డికి అధిష్టానం నుంచి కబురు
అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు అయినట్లు ప్రకటించిన బండి సంజయ్
ఖమ్మం లో ధ్రువీకరించిన సుధాకర్ రెడ్డి
షెడ్యూల్ ప్రకారం ఈ అర్ధరాత్రికి హైదరాబాద్ చేరుకోవాల్సిన అమిత్ షా
*ఖమ్మం సభ తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్న బండి సంజయ్

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పర్యటన షడ్యూల్ ప్రకారం గురువారం ఖమ్మం లో జరగాల్సి ఉంది. కానీ అది రద్దు అయినట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు . అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర తుపాను బిపర్ జాయ్ కారణంగా రేపు కేంద్ర హోం మంత్రి పర్యటనను రద్దు చేశామని బీజేపీ వర్గాలు వెల్లడించాయి . ఈ విషయాన్ని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఖమ్మంలో నిర్వహించే సభ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.  షెడ్యూల్ ప్రకారం ఈ అర్ధరాత్రికి అమిత్ షా హైదరాబాద్ కు చేరుకోవాల్సి ఉంది. రేపు ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగసభలో పాల్గొనాల్సి ఉంది.  తుపాను కారణంగా ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు ఇప్పటికే తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ టీములు ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో మోహరించాయి. రెస్క్యూ ఆపరేషన్స్ ను అమిత్ షా స్వయంగా పర్యవేక్షిస్తారని బండి సంజయ్ తెలిపారు.

దీన్ని ఖమ్మం సభ ఏర్పాట్లలో ఉన్న బీజేపీ జాతీయ నాయకులు , తమిళనాడు సహా ఇంచార్జి మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా నిర్దారించారు .గత రెండు రోజులుగా ఆయన ఖమ్మం లోనే మకాం వేసి జిల్లా కమిటీని జన సమీకరణ కోసం అప్రమత్తం చేసి తాను కూడా రంగంలోకి దిగారు .సొంత జిల్లా అయినందున కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మొదటిసారి జిల్లాకు వస్తున్నందున ఆయన కూడా జన సమీకరణకు పూనుకున్నారు . బుధవారం మధ్యాహ్నం వైరా , మధిర , బోనకల్లు ప్రాంతాలకు వెళ్ళడానికి ఆయన సమాయత్తమైన సమయంలో అధిష్టానం నించి తెలంగాణ బీజేపీ ఇంచార్జి తరుణ ఛుగ్ నుంచి ఫోన్ వచ్చింది. అమిత్ షా జీ తెలంగాణ పర్యటన రద్దు అయిందని దాని సారాంశం .దీంతో స్టేజి , మైకులు , అలంకరణ ఏర్పాట్లు చేసుకున్న నేతలకు నిరాశ ఎదురైంది. అయితే ఇంకా తెలంగాణాలో ప్రత్యేకించి ఖమ్మం జిల్లాలో ఎండలు తీవ్రంగా ఉండటంతో జన సమీకరణపై సందేహాలు ఉన్నాయి. అయినప్పటికీ అమిత్ షా పర్యటన ఛాలంజ్ గా తీసుకున్న నాయకత్వం ఏర్పాట్లలో బిజీ గా ఉంది . ఆయన రావడంలేదని వార్త రావడం తో వెంటనే ఏర్పాట్లను నిలిపివేశారు .సభ ,జన సమీకరణ కోసం ఖమ్మంలో మకాం వేసిన సుధాకర్ రెడ్డి , మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావులు హైద్రాబాద్ బయలుదేరి వెళ్లారు .

రద్దు కు గుజరాత్ తుఫాన్ కారణంగా చెపుతున్నప్పటికీ రకరకాల కారణాలు ఉన్నట్లు తెలుస్తుంది. మొదటి నుంచి బీజేపీకి అసలే బలం లేని ఖమ్మం జిల్లాలో బీజేపీ అగ్రనేత బహిరంగ సభ పెట్టడం రాజకీయ పరిశీలకులకు కొంత ఆశ్చర్యం కలిగించింది . దీనికి భారీ జనసమీకరణ చేస్తున్నట్లు నేతలు చెప్పారు . ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీకి ప్రస్తుతానికి సాధ్యం కానీ పని. అమిత్ షా సభకు కనీసం సమీకరణ జరగాలి …అది స్థానిక నాయకత్వానికి సవాల్ లాంటిదే … ఖమ్మం నుంచి కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి సమీకరణ కోసం సిద్ధమైయ్యారు . అయినప్పటికీ అధిక ఉష్టోగ్రతలు ,ఉక్కపోతకు ప్రజలు వస్తారా లేదా అనే సందేహాలు …మాజీఎంపీ పొంగులేటి పై సన్నగిల్లిన ఆశలు …అన్ని దోడైయ్యాని అంటున్నారు …

అమిత్ షా పర్యటన ఖరారు అయిన వెంటనే ఖమ్మం వచ్చిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అమిత్ షా పర్యటన కోసం అనేక జిల్లాలు పోటీపడినప్పటికీ ఖమ్మంకు ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు . కాంగ్రెస్ ,కమ్యూనిస్టుల జిల్లా అని కొందరు అంటున్నారు . ఇది కాషాయ జిల్లా అని నిరూపించాలని ఇక్కడ నేతలకు ఉద్బోధ చేశారు . రాష్ట్ర పార్టీలో అంతర్గత పోరుపై కూడా అమిత్ షా ఇక్కడ నాయకులకు గట్టిగానే క్లాస్ తీసుకుంటారని వార్తలు వచ్చాయి. అంతే కాకుండా కొంతమంది సెలబ్రిటీలను కలుస్తారని వారిలో ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి , అగ్ర హీరో ప్రభాస్ లతో ఆయన మాట్లాడతారని ప్రకటించారు . భద్రాచలం దర్శనం కూడా ఉంటుందని అన్నారు .కానీ ఆయన టూర్ రద్దు అయింది.ఇది బీజేపీ అంతర్గత కలహాలను బయట పెడుతుందని గుజరాత్ తుఫాన్ అనేది ఒక సాకు మాత్రమే అని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఖమ్మం జిల్లా నుంచి బలమైన నేతగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీ లో చేరతారని భావించారు . అయితే ఆయన రాష్ట్రంలో బీఆర్ యస్ ను ఓడించాలంటే బీజేపీ కన్నా కాంగ్రెస్ కే అవకాశాలు ఉన్నాయని నిర్ణయించుకొని వారితో టచ్ లోకి వెళ్లి పోయారు . అమిత్ షా ఖమ్మం వస్తున్నారంటే ఆయన పునరాలోచన చేస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే అలాంటివి ఏమి లేక పోవడంతో ఖమ్మం జిల్లాలో పర్యటనతో పాటు తెలంగాణ పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఖమ్మం అమిత్ షా పర్యటన తర్వాత ఉంటుందని తేదీని ప్రకటిస్తామని బండి సంజయ్ తెలిపారు …

 

Related posts

పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తోంది: కృష్ణాబోర్డుకు తెలంగాణ మరో లేఖ!

Drukpadam

బీజేపీది అచ్ఛేదిన్ కాదు చచ్చేదిన్:సీఎల్పీ నేత భట్టి!

Drukpadam

కండోమ్స్ ఎక్కువ‌గా వాడేది ముస్లింలే: ఎంపీ అస‌దుద్దీన్!

Drukpadam

Leave a Comment