- దావోస్ వేదికగా జరిగిన ఒప్పందం
- రాష్ట్రంలో డేటా సెంటర్లను విస్తరించేందుకు భారీ పెట్టుబడి
- అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్‌తో సీఎం భేటీ
తెలంగాణలో రూ.60 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్ అంగీకారం తెలిపింది. ఈ మేరకు అమెజాన్, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. దావోస్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైకేల్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.
తెలంగాణలో అమెజాన్ భారీ పెట్టుబడితో రాష్ట్రంలో డేటా సెంటర్లను అమెజాన్ విస్తరించనుంది. వీటికి అవసరమైన భూమిని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ సంగ్రాజ్‌తో తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. పోచారంలో ఐటీ క్యాంపస్ విస్తరణకు ఇన్ఫోసిస్ అంగీకారం తెలిపింది. రూ.750 కోట్లతో మొదటి దశ విస్తరణ చేపడతామని ఇన్ఫోసిస్ తెలిపింది. దీంతో కొత్తగా 17 వేల ఉద్యోగాలు రానున్నాయని అధికారులు తెలిపారు.