Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

బీఆర్‌ఎస్ నేతలపై రెండో రోజూ ఐటీ సోదాలు….

బీఆర్‌ఎస్ నేతలపై రెండో రోజూ ఐటీ సోదాలు….

  • ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని టార్గెట్ చేసిన ఐటీ
  • దాడుల్లో 70 మందితో కూడిన అధికారుల బృందం
  • రాజకీయ దురుద్దేశంతోనే సోదాలు చేస్తున్నారన్న నేతలు 

హైదరాబాద్ లో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో రెండో రోజు కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు.  కొత్తపేట్ గ్రీన్ హిల్స్ కాలనీ లోని శేఖర్ రెడ్డి నివాసం, మర్రి జనార్దన్ రెడ్డికి చెందిన జేసీ బ్రదర్స్ షోరూమ్స్‌తో పాటు అమీర్‌పేట్‌లోని కార్పొరేట్ ఆఫీసు, జేసీ స్పిన్నింగ్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, జేసీ బ్రదర్స్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, మర్రి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, కొత్తూరు పైపుల కంపెనీ కార్యాలయాలను ఐటీ అధికారులు జల్లెడ పడుతున్నారు. ఏక కాలంలో ఒడిశా, ఢిల్లీకి చెందిన 70 మందితో కూడిన ఐటీ అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.

ఎమ్మెల్యే  పైళ్ల శేఖర్ రెడ్డి  భార్య  వనితా రెడ్డిని  ఐటీ అధికారులు బ్యాంకుకు తీసుకెళ్లి  లాకర్లు ఓపెన్ చేయించారని సమాచారం. శేఖర్ రెడ్డి  పలు  రియల్ ఏస్టేట్  సంస్థల్లో  పెట్టుబడి పెట్టినట్టుగా  ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఐటి సోదాలపై బీఆర్ఎస్ శ్రేణులు మండి పడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీని నైతికంగా దెబ్బతీసేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఐటీ సోదాలు చేయిస్తోందంటూ నేతలు ఆరోపిస్తున్నారు. తన వ్యాపారాలన్నీ  తెల్లకాగితం వంటివని  మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి  స్పష్టం చేశారు.  రాజకీయ దురుద్దేశంతోనే  ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారని ఆయన  ఆరోపించారు.

Related posts

కెనడా,అమెరికా కాదు, ముందు మనదేశంలో తిరగండి….పంజాబ్ డిప్యూటీ స్పీకర్

Drukpadam

ప్రతికేసులోనూ అరెస్టు తప్పనిసరి కాదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

Drukpadam

లండ‌న్‌లో కేటీఆర్‌… పారిశ్రామిక దిగ్గ‌జాల‌తో రౌండ్ టేబుల్ సమావేశం!

Drukpadam

Leave a Comment