Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలురాజకీయ వార్తలు

గెలుపొందే వారికే టికెట్లు ఇస్తామన్నరాజస్థాన్ సీఎం గెహ్లాట్….!

ఎన్నికల్లో మనం గెలవాలంటే…: పార్టీ శ్రేణులకు అశోక్ గెహ్లాట్ కీలక సూచన

  • గెలుపొందే వారికే టికెట్లు ఇస్తామన్న గెహ్లాట్
  • రెండు నెలల ముందు అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడి
  • రాజకీయాల్లో సక్సెస్ కావాలనుకునేవారికి సహనం ఉండాలని సూచన

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి గెలిచే సత్తా ఉన్నవారికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇస్తుందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పష్టం చేశారు. ఎన్నికలకు రెండు నెలల ముందు అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. రాజకీయాల్లో సక్సెస్ కావాలనుకునే వారికి సహనం ఉండాలని అన్నారు. రాజస్థాన్ యూత్ కాంగ్రెస్ సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

టికెట్ రాలేదని నిరాశపడొద్దని, పార్టీ కోసం కష్టపడి పని చేయాలని, సహనంతో ముందడుగు వేసేవారే రాజకీయాల్లో సక్సెస్ అవుతారని గెహ్లాట్ అన్నారు. ఎన్నికల్లో మనం గెలవాలంటే… విజయం సాధించే సత్తా ఉన్నవారికే టికెట్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. టికెట్ల కోసం ఢిల్లీలో తిరిగినా ఉపయోగం ఉండదని… ఎన్నికలకు రెండు నెలల ముందు మాత్రమే అభ్యర్థులను ఖరారు చేస్తామని తెలిపారు. రెండు నెలల ముందు అభ్యర్థులను ప్రకటించడం వల్ల వారు వారి నియోజకవర్గాల్లో కష్టపడి పనిచేయడానికి వీలు కలుగుతుందని చెప్పారు.

Related posts

మాట ఇవ్వడం… మర్చిపోవడం కల్వకుంట్ల కుటుంబానికే సాధ్యం….పొంగులేటి

Ram Narayana

ఉచిత విద్యుత్ పై బీఆర్ యస్ ది గోబెల్స్ ప్రచారం …సీఎల్పీ నేత భట్టి

Drukpadam

సభ నిర్వాణం తీరుపై సీఎం ,స్పీకర్ , శాశనసభ వ్యవహారాల మంత్రి లేఖ రాస్తా …భట్టి

Drukpadam

Leave a Comment