Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పొంగులేటి ,జూపల్లి నివాసాలకు కాంగ్రెస్ నేతలు రేవంత్, కోమటిరెడ్డి…

పొంగులేటి ,జూపల్లి నివాసాలకు కాంగ్రెస్ నేతలు రేవంత్, కోమటిరెడ్డి…
-పార్టీలోకి సాదరంగా ఆహ్వానం …అందుకు వారు అంగీకారం
-తెలంగాణ ప్రజల కోసం అందరం ఏకమవుతున్నామన్నపొంగులేటి
-కాంగ్రెస్ పార్టీలో చేరాలని రేవంత్ రెడ్డి ఆహ్వానించారని వెల్లడి
-తాను, జూపల్లి కలిసి తెలంగాణలో పర్యటిస్తున్నామన్న పొంగులేటి
-పార్టీలో చేరికపై మూడు నాలుగు రోజుల్లో ప్రకటన

రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు లు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు . బుధవారం వారిని పార్టీలోకి ఆహ్వానించేందుకు స్వయంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి , మాజీ మంత్రి చిన్నారెడ్డి , మాజీ ఎంపీ మల్లు రవి , మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ తదితర కాంగ్రెస్ నేతల బృందం వారి నివాసాలకు వెళ్లి వారిని పార్టీలోకి రావాలని కోరారు .వారి కోరికకు వీరువురు నేతలు అంగీకారం తెలిపారు .

మూడు నాలుగు రోజుల్లో పార్టీలో చేరికపై ఓ ప్రకటన చేస్తామని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం స్వయంగా ప్రకటించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు మాజీ మంత్రి జూపల్లి, పొంగులేటిలతో భేటీ అయ్యారు. వారిని రేవంత్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జూపల్లితో కలిసి పొంగులేటి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల కోసం అందరం ఏకమవుతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని రేవంత్ రెడ్డి ఆహ్వానించారని తెలిపారు. ఉద్యమకారులు, ప్రజలు, కవులతో ఇప్పటికే చర్చలు జరిపామని, కొన్ని రోజుల్లోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

ఆరు నెలల నుండి తాము రాష్ట్రంలోని పరిస్థితులను గమనిస్తున్నామన్నారు. తాను, జూపల్లి కలిసి తెలంగాణలో పర్యటిస్తున్నామన్నారు. తెలంగాణ సాధించాక ప్రజల కలలు సాకారం కాలేదన్నారు. అంతకుముందు రేవంత్ మాట్లాడుతూ… ఖమ్మం జిల్లా ముఖ్య నేతలు తమతో కలిసి రావాలని ఆహ్వానించామని చెప్పారు. ఖమ్మం నేతలు అందరూ పొంగులేటి కాంగ్రెస్ లోకి రావాలని కోరుకుంటున్నారన్నారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ ఒక్కసారిగా గ్రాఫ్ పెంచుకోగా , నిన్న మొన్నటివరకు రాష్ట్రంలో విఫరీతంగా పెరుగుతుందనుకున్న బీజేపీ గ్రాఫ్ పడిపోయింది .తెలంగాణ రాష్ట్రంలో ఆపార్టీకి అధికారం సంగతి దేవుడెరుగు ఉనికి కాపాడుకోవడం పెద్ద సవాల్ గా మారింది. రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంపై పొంగులేటి ,జూపల్లి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు . అధికార బీఆర్ యస్ పై తిరుగుబాటు చేసి కేసీఆర్ ని ఎదిరించిన సాహసవంతులుగా నిలిచారు .వారు గత ఆరు నెలలుగా బీఆర్ యస్ ను ఓడించేందుకు ఏ పార్టీలో చేరాలి అనే దాంట్లో సతమతం అయ్యారు .చివరికి బీఆర్ యస్ ను ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్ కే ఉందని గట్టి నిర్దారణకు వచ్చారు .వారిని నమ్ముకున్న ప్రజలు హితులు ,సన్నిహితులు కూడా కాంగ్రెస్ అయితేనే మంచిదని వారికీ సలహా ఇచ్చారు . దీంతో హస్తం గూటికి చేరేందుకు నిర్ణయించుకున్నారు . మొదట ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలవనున్నారు .తర్వాత ఆయన ఇచ్చే తేదీని బట్టి ఖమ్మంలో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి ఖమ్మం ప్రజల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా రాహుల్ గాంధీ చేత మూడు రంగుల కండువా కప్పించుకోవాలని భావిస్తున్నారు .

 

Related posts

రాఘురామ కృషంరాజు కాళ్లకు తగిలినవి దెబ్బలుకాదు ఎడిమా…

Drukpadam

కేటీఆర్ తో కలిసి ఢిల్లీకి వెళ్లిన మంత్రులు!

Drukpadam

పొంగులేటికి బీజేపీ బంపర్ ఆఫర్…కేంద్రమంత్రి పదవి ఇస్తామని సంకేతాలు !

Drukpadam

Leave a Comment