Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కుబేరులను తీసుకెళుతూ గల్లంతైన సబ్ మెరైన్ ను గుర్తించేందుకు రంగంలోకి విక్టర్-6000….

కుబేరులను తీసుకెళుతూ గల్లంతైన సబ్ మెరైన్ ను గుర్తించేందుకు రంగంలోకి విక్టర్-6000….

  • టైటానిక్ శిథిలాలను చూసేందుకు వెళ్లిన టైటాన్ సబ్ మెరైన్
  • ఉన్నట్టుండి ఆచూకీ లేకుండా పోయిన వైనం
  • సహాయక చర్యలు ముమ్మరం
  • జలాంతర్గామిలో ఆక్సిజన్ ఈ సాయంత్రం వరకే సరిపోతుందంటున్న నిపుణులు

దశాబ్దాల కిందట సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక శిథిలాలను చూడ్డానికి వెళ్లిన ఓషన్ గేట్ టైటాన్ అనే సబ్ మెరైన్ ఆచూకీ లేకుండా పోవడం తెలిసిందే. ఈ సబ్ మెరైన్ లో పలువురు ప్రపంచ కుబేరులు ఉండడంతో తీవ్ర ఆందోళన నెలకొంది.

ఈ మినీ జలాంతర్గామిలో ఉన్న ఆక్సిజన్ ప్రాణవాయువు ఈ సాయంత్రం 7.15 గంటల వరకే సరిపోతుందన్న నిపుణుల అంచనాల నేపథ్యంలో సహాయక చర్యలు మరింత ముమ్మరం చేశారు.

తాజాగా టైటాన్ సబ్ మెరైన్ ఆచూకీ కోసం ఫ్రాన్స్ దేశానికి చెందిన విక్టర్-6000 అనే అత్యాధునిక ఆక్వాటిక్ రోబోను కూడా రంగంలోకి దించారు. 4.5 టన్నుల బరువున్న ఈ భారీ రోబో సముద్రంలో 20,000 అడుగుల లోపలి వరకు వెళ్లగలదు. గల్లంతైన టైటాన్ సబ్ మెరైన్ కంటే ఇది ఎక్కువ లోతులో ప్రయాణించగలదు.

అయితే, ఈ ఫ్రెంచ్ రోబో టైటాన్ సబ్ మెరైన్ ను గుర్తించినా, దాన్ని స్వయంగా వెలుపలికి తీసుకురాలేదు. టైటాన్ కు కొన్ని కేబుల్స్ అనుసంధానం చేసి వాటిని ఉపరితలంపైకి తీసుకువస్తుంది. ఉపరితలంపై ఉన్న భారీ యంత్రాల ద్వారా టైటాన్ ను సముద్ర గర్భం నుంచి బయటికి తీసుకువస్తారు. ఈ విక్టర్-6000 రోబో ఏకధాటిగా మూడ్రోజుల పాటు పనిచేయగలదు.

కాగా, సముద్ర గర్భంలో కొన్ని చోట్ల ధ్వనులు వస్తున్నప్పటికీ, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయన్నది కచ్చితంగా గుర్తించలేకపోయారు.

 

ఆచూకీ లేని సబ్‌మెరైన్: మునిగిపోయిన టైటానిక్ గురించి కామెరూన్ ఏం చెప్పారంటే?

Submersible missing What James Cameron said on Titanic

సముద్రగర్భంలో అచూకీ లభించకుండా పోయిన టైటాన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగారు. ఇప్పటికే కీలకమైన మూడు రోజుల గడువు కావొస్తుంది. రెస్క్యూ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టైటానిక్ మునిగిపోయిన ప్రాంతాన్ని పలుమార్లు సందర్శించిన హాలీవుడ్ దర్శకుడు జేమ్ కామెరూన్ గతంలో పంచుకున్న అనుభవాలు ఇప్పుడు చాలామంది గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఈ భూమ్మీద అత్యంత క్రూరమైన ప్రదేశాల్లో ఇది ఒకటి అని టైటానిక్ మునిగిపోయిన ప్రాంతం గురించి చెప్పారు. 13వేల అడుగుల ఎత్తులో ఉన్న టైటానిక్ ను డాక్యుమెంటరీ రూపంలో తీసుకు వచ్చిన కామెరూన్ టైటానిక్ షిప్ మునిగిపోయిన ప్రాంతాన్ని 33సార్లు సందర్శించారు.

మనుషులు ఎప్పుడూ చూడని ప్రదేశాలకు వెళ్లడం అంటే తనకు ఇష్టమని, అందుకే టైటానిక్ మునిగిన ప్రాంతానికి వెళ్లినట్లు చెప్పారు. ఓడ మునిగిపోయిన ప్రాంతాన్ని చూడాలనే ఆకాంక్షతోనే టైటానిక్ సినిమాను తీసినట్లు చెప్పారు. కానీ ప్రత్యేకంగా దానిని ఒక సినిమాగా తీయాలనే ఉద్దేశ్యం తనకు లేదన్నారు. ఆ కారణంతోనే సముద్రగర్భంలో సబ్ మెరైన్ లో ప్రయాణించానన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అతిపెద్ద ప్రమాదాల్లో టైటానిక్ ఎవరెస్ట్ వంటిది అన్నారు. దానిని బాగా చూపించాలనే ఉద్దేశ్యంతోనే పలుమార్లు టైటానిక్ మునిగిన ప్రాంతాన్ని సందర్శించినట్లు చెప్పారు. కాగా, టైటానిక్ గురించి గతంలో స్పందించిన కామెరూన్.. ఇప్పుడు గల్లంతైన టైటాన్ గురించి ఇప్పటి వరకు అయితే స్పందించలేదు.

Related posts

రాయల చెరువుకు మరమ్మతులు పూర్తి…ఇంటికి చేరుకున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి!

Drukpadam

పేదరికం లేని భారత్ నిర్మాణమే తమ లక్ష్యం …రాష్ట్రపతి ద్రౌపది ముర్ము !

Drukpadam

ఏపీ ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన ఉద్యోగ సంఘాలు…

Drukpadam

Leave a Comment