విషాదంగా ముగిసిన టైటానిక్ పర్యాటక సబ్ మెరైన్…ఐదుగురి ప్రయాణికుల గల్లంతు …
సబ్ మెరైన్ బద్దలైందనే అనుమానాలు
విహారానికి వచ్చి కానరాని లోకాలకు వెళ్లిన నాలుగు దేశాలకు చెందిన సంపన్నలు …
ప్రపంచాన్ని నివ్వెర పరిచిన విషాదం
అమెరికా –కెనడా బోర్డర్ లోని అట్లాంటిక్ మహాసముద్రంలో 1912 ప్రమాదానికి గురైన టైటానిక్ షిప్ ను చూసేచేందుకు వెళ్లిన ఐదుగురు పర్యాటకులు గల్లంతైయ్యారు . గురువారం రాత్రివరకు వారు తిరిగి వస్తారని ఆశతో ఎదురు చూసిన నిరాశ ఎదురైంది. సబ్ మెరైన్ నాలుగురోజులు సరిపడా ఆక్సిజన్ ,ఇంధనం ఉన్నాయని అయితే వారు వెళ్లిన రోజునే జలాంతర్గామి సిగ్నల్స్ కట్ అయ్యాయని అధికారులు తెలిపారు . అయినప్పటికీ వారు బతికి ఉండవచ్చునని ఆశ నిన్న సాయంత్రం వరకు మిణుకుమిణుకు మన్నది చివరకు అమెరికా కోస్ట్ గార్డ్ లు అత్యత టెక్నాలజీతో జరిపిన ఆపరేషన్ లో సబ్ మెరైన్ శకలాలను గుర్తించారు . చాల లోతులో అయిఉన్నట్లు నిర్దారించుకున్న అధికారులు పర్యాటకుల కుటుంబాలకు సమాచారం అందించారు .
గల్లంతైన సబ్ మెరైన్ లో బ్రిటిషన్ బిజినెస్ మెన్, అడ్వెంచరర్ హమీష్ హార్డింగ్, పాకిస్తాన్ కు చెందిన యూకే వ్యాపారవేత్త షెహ్జాదా దావూద్, అతని తనయుడు సులేమన్ దావూద్, ఓసియన్ గేట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఫౌండర్ స్టాక్టాన్ రష్, ఫ్రెంచ్ సబ్ మెరైన్ పైలట్ పాల్ హెన్రీ నార్గోలెట్ ఉన్నారు.
1912 ఏప్రిల్ 15 న ఇంగ్లాండ్ నుంచి అమెరికాలోని న్యూయార్క్ బయలుదేరిన ఓడ మంచు గడ్డలను ఢీకొని ప్రమాదానికి గురైంది . ఓడలో ప్రయాణిస్తున్న 2200 పైగా ప్రయాణికుల్లో 1500 చనిపోయారు . అది ప్రపంచ దుర్ఘటనల్లో అత్యంత విషాదంగా మిగిలింది. దాన్ని చూడటానికి వెళ్లిన పర్యాటకులు గల్లంతు కావడం అత్యంత దయనీయమైన సంఘటనగా మారింది.
టైటానిక్ శిథిలాల పక్కనే…: తప్పిపోయిన టైటాన్ జలాంతర్గామి గుర్తింపు!
టైటాన్ జలాంతర్గామి కోసం వెతుకుతున్న ప్రాంతంలో శిథిలాల గుర్తింపు
టైటాన్ ను వెతికేందుకు పంపిన రిమోట్ ఆపరేటెడ్ వెహికిల్
శకలాలను గుర్తించినట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ వెల్లడించారు .
తప్పిపోయిన టైటాన్ జలాంతర్గామి కోసం వెతుకుతున్న ప్రాంతంలో శిథిలాలను గుర్తించినట్లు యుఎస్ కోస్ట్ గార్డ్ తెలిపింది. టైటాన్ ను వెతికేందుకు పంపిన రిమోట్ ఆపరేటెడ్ వెహికిల్ కొన్ని టైటాన్ శకలాలను గుర్తించినట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ ట్వీట్ చేసింది. రిమోట్ ఆపరేటెడ్ వెహికిల్ పంపిన సమాచారాన్ని నిపుణులు విశ్లేషిస్తున్నట్లు తెలిపింది. టైటానిక్ ఓడ శిథిలాల పక్కనే టైటాన్ శకలాలను గుర్తించినట్లుగా తెలుస్తోంది.