Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

డాక్టర్ శ్యామ్ కుమార్ నిర్దోషి జైలుకు తరలించడంలో కుట్ర : తెలంగాణ డాక్టర్స్ ఫోరం కన్వీనర్…

డాక్టర్ శ్యామ్ కుమార్ నిర్దోషి జైలుకు తరలించడంలో కుట్ర : తెలంగాణ డాక్టర్స్ ఫోరం కన్వీనర్..
-మంత్రి ప్రోద్బలం తోనే డాక్టర్ శ్యామ్ కుమార్ పై కేసు
-కుల దురంహాకారంతోనే అరెస్ట్
-ఆయన ఎలాంటి నకిలీ ఇంజక్షన్ ఇవ్వలేదు
-గతంలో ఆయన చేసిన సేవలకు కలెక్టర్ సైతం ప్రశంసించారు


చెస్ట్ ఫిజిషియన్ డాక్టర్ శ్యామ్ కుమార్ నిర్దోషి అని , కుల అహంకారం తోనే ఆయన పై కేసు నమోదు చేసి కుట్ర పూరితంగా జైలుకు తరలించడం జరిగిందని తెలంగాణ డాక్టర్స్ ఫోరం (టీ. డీ.ఫ్.) కన్వీనర్ డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ ఆరోపించారు . ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం కరోనా సందర్భంగా ప్రభుత్వ , ప్రైవేటు ఆసుపత్రులలో రోగులకు చేసిన సేవలను జిల్లా కలెక్టర్ తో పాటు పలువురు రోగులు ఆయన ప్రశంసించిన విషయం గుర్తు చేస్తూ, కావాలని డాక్టర్ శ్యామ్ కుమార్ వ్యక్తిత్వాన్ని దెబ్బ తీశారని విమర్శించారు . కరోనా ట్రీట్ మెంట్లో నకిలీ రేమిడే సివిర్ వాడారని , డి .ఎం. అండ్ హెచ్ వో , ఏ .సి .పి , డ్రగ్ ఇన్స్పెక్టర్ తో కూడిన టాస్క్ ఫోర్స్ తనిఖీ చేసిన సందర్భంగా ఎటువంటి నకిలి ఇంజెక్షన్లు , ఖాళీ వయల్స్ , బిల్లులు లభించలేదని తెలిపారు . గతంలో ఓ ఏ. సి .పి .డాక్టర్ శ్యామ్ కుమార్ పై చేయి చేసుకున్న సందర్భంని పురస్కరించుకుని జిల్లాకు చెందిన మంత్రి ప్రోద్బలంతో నిజనిర్ధారణ కాకముందే ఎఫ్ఐఆర్ తయారు చేశారని ఆరోపించారు . ఎడిట్ చేయబడిన వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు ఏ విధంగా చేస్తారని ప్రశ్నించారు . మృతుడునీ ఒక వారం ముందు హైయర్ సెంటర్ రిఫర్ చేయడం జరిగిందని , వారం తర్వాత వేరే ఆస్పత్రిలో మరణిస్తే డాక్టర్ శ్యామ్ కుమార్ ను ఏవిధంగా బాధ్యులు చేస్తారని అడిగారు . మరణం నకిలీ ఇంజక్షన్ కారణమైతే , విషం ప్రాకీ వెంటనే చనిపోవాలి గాని వారం రోజులు టైమ్ ఎందుకు పడుతుందని ప్రశ్న వేశారు . డ్యూటీలో ఉండగా డాక్టర్ శ్యామ్ కుమార్ పై ఏ.సి.పి చేయి చేసుకున్న సందర్భంగా పెట్టిన కేసుతో ఏ.సి.పి సస్పెండ్ అయ్యారని తెలిపారు . ఎటువంటి ఆధారాలు లేకుండా శ్యామ్ కుమార్ ను అరెస్టు చేయడం వెనుక కుల దురహంకారం ఉందని విమర్శించారు . మంత్రి , పోలీసుల కారణంగానే అరెస్టు చేసి జైలుకు తరలించడం జరిగిందని , డాక్టర్ గిరిజన లంబాడి సామాజిక వర్గానికి
చెందిన వారు కావడం తోనే ఈ కుట్రకు తెరలేపారు అని దుయ్యబట్టారు . ఎలాంటి ఆధారాలు లేకుండానే కుట్ర పన్ని గిరిజన లంబాడి డాక్టర్ను జైలుకు పంపినందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు .

Related posts

చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట… ముగ్గురి మృతి

Drukpadam

నెలకు రూ. 45 వేల జీతం.. ఆస్తులేమో రూ. 10 కోట్లకు పైనే.. దాడుల్లో బయటపడిన అవినీతి

Ram Narayana

అయ్యన్న అరెస్ట్.. ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల ఆందోళనలు!

Drukpadam

Leave a Comment