Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

కమిషన్ల తెలంగాణ… అవినీతిలో కర్ణాటకకు మించిపోయింది ..ఠాక్రే

కర్ణాటకలో 30 శాతం ఐతే తెలంగాణలో 50 శాతం కమీషన్: ఠాక్రే

  • బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందమన్న ఠాక్రే
  • తెలంగాణలో బీజేపీతో వైరం అంటూ.. ఢిల్లీలో కలుస్తున్నారని ఆగ్రహం
  • ఎమ్మెల్సీ కవితపై చర్యలేవని నిలదీసిన కాంగ్రెస్ ఇంచార్జ్

బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటేనని తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే ఆరోపించారు. ఆయన యూత్ కాంగ్రెస్ నేతలతో నేడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందన్నారు. ఒప్పందం ప్రకారమే వారు పని చేస్తున్నారని ఆరోపించారు. అందుకే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఢిల్లీ పర్యటన అని ధ్వజమెత్తారు. ఇక్కడ తెలంగాణలో బీజేపీతో వైరం అంటున్నారని, ఢిల్లీలో మాత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలుస్తున్నారని దుయ్యబట్టారు.

ఆ రెండు పార్టీల మధ్య ఎలాంటి ఒప్పందం లేకుంటే ఎమ్మెల్సీ కవితపై చర్యలేవన్నారు. కర్ణాటకలో ఇటీవలి వరకు ఉన్న బీజేపీ ప్రభుత్వానిది 30 శాతం కమీషన్ సర్కార్ అయితే, తెలంగాణలో ఏకంగా 50 శాతం కమీషన్ సర్కార్ నడుస్తోందన్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఒక్క సీటు గెలిచినా తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని సవాల్ చేశారు. బీఆర్ఎస్ ను ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ కు మాత్రమే ఉందని ప్రజలు నమ్ముతున్నారన్నారు.

Related posts

దిల్ రాజ్ సయోధ్య… సంధ్య థియేటర్ సంఘటనకు ఎండ్ కార్డు పడనున్నదా…

Ram Narayana

నారాయణ స్కూలులో ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్య..!

Ram Narayana

టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ఏపీని అభివృద్ధికి దూరం చేశాయి: సోము వీర్రాజు…

Drukpadam

Leave a Comment