Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలురాజకీయ వార్తలు

ప్రతిపక్షాల పాట్నా భేటీపై ప్రధాని వ్యంగ్యాస్త్రాలు…

20 లక్షల కోట్ల కుంభకోణం గ్యారెంటీ: ప్రతిపక్షాల భేటీపై ప్రధాని వ్యంగ్యాస్త్రాలు…

  • ఈ మధ్య ‘గ్యారెంటీ’ అనే మాట ఎక్కువగా వినినిపిస్తోందన్న ప్రధాని
  • కాంగ్రెస్ ఒక్కటే లక్షల కోట్ల కుంభకోణాలు చేసిందని విమర్శ
  • ప్రతిపక్షాలకు స్కామ్‌ల అనుభవం మాత్రమే ఉందని ఎద్దేవా

 

బీహార్‌‌లోని పాట్నాలో ఇటీవల జరిగిన ప్రతిపక్షాల భేటీపై ప్రధాని నరేంద్ర మోదీ సెటైర్లు వేశారు. ‘‘ఈ మధ్య ‘గ్యారెంటీ’ అనే మాట ఎక్కువగా వినినిపిస్తోంది. ఈ గ్యారంటీ అనేది అవినీతి గురించేనని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు బీజేపీ కార్యకర్తలపై పడింది. ఇది లక్షల కోట్ల కుంభకోణానికి సంబంధించిన హామీ’’ అని అన్నారు.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘కొన్ని రోజుల కిందట వాళ్లు (ప్రతిపక్షాలు) ఫొటో షూట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. అందులో పాల్గొన్న వాళ్లను ఒకసారి గమనిస్తే.. ప్రతి ఒక్కరూ రూ.20 లక్షల కోట్ల కుంభకోణానికి గ్యారెంటీనే అని మీకు అర్థమైపోతుంది” అని ఎద్దేవా చేశారు. ఒక్క కాంగ్రెస్ మాత్రమే లక్షల కోట్ల కుంభకోణాలు చేసిందని విమర్శించారు.
‘‘కొంతమంది తమ పార్టీ కోసమే బతుకుతున్నారు. తమ పార్టీకి మాత్రమే లబ్ధి చేకూర్చాలని చూస్తారు. వారికి అవినీతిలో వాటా, కమీషన్ వస్తుంది. కష్టపడాల్సిన అవసరం ఉండదనే ఈ దారిని ఎంచుకున్నారు” అని మోదీ ఆరోపించారు.
ఈ పార్టీలకు స్కామ్‌ల అనుభవం మాత్రమే ఉందని మోదీ ఎద్దేవా చేశారు. అందుకే స్కామ్‌లకు సంబంధించిన హామీలే ఆ పార్టీలు ఇవ్వగలవన్నారు. ఈ విషయాన్ని దేశం గుర్తించాలని కోరారు. మరోవైపు కుంభకోణం చేసిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామనే మోదీ ‘గ్యారెంటీ’ కూడా ఉందని వివరించారు.

Related posts

కర్ణాటకలో కాంగ్రెస్ దే హవా… బీజేపీ ఖేల్ ఖతం.. !

Drukpadam

బండి సంజయ్ మిలీనియం మార్చ్ పై మండిపడ్డ హరీష్ రావు…

Drukpadam

ఆత్మరక్షణలో ఎం ఐ ఎం …బీజేపీతో లాలూచి లేదని వెల్లడి!

Drukpadam

Leave a Comment