- నిన్న షరతులతో కూడిన బెయిల్ మంజూరు
- రఘురామ న్యాయవాదులకు అందని కోర్టు ఆదేశాలు
- కింది కోర్టులో సోమవారం పూచీకత్తు సమర్పించనున్న న్యాయవాదులు
వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిలుపై సోమవారం విడుదలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఆయనకు నిన్న సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే. అయితే, కోర్టు ఆదేశాలు ఎంపీ న్యాయవాదులకు ఇంకా అందని నేపథ్యంలో ఆయన విడుదల ఆలస్యం అవుతున్నట్లు తెలిసింది.
కింది కోర్టులో సోమవారం పూచీకత్తు సమర్పించేందుకు ఆయన తరఫు న్యాయవాదులు ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు. రఘురామ రూ.లక్ష వ్యక్తిగత బాండు, ఇద్దరు పూచీకత్తు సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆసుపత్రిలోనే ఉన్నారు.
విడుదలైన తర్వాత కూడా రఘురామకృష్ణరాజు ఈ కేసుకు సంబంధించిన అంశాలపై మీడియా, సామాజిక మాధ్యమాల్లో మాట్లాడకూడదని కోర్టు ఆదేశించింది. సాక్ష్యాలను ప్రభావితం చేయకూడదని షరతులు విధించింది. ఒకవేళ రఘురామ వీటిని ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని తెలిపింది.