Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలురాజకీయ వార్తలు

ఖమ్మం అసెంబ్లీకి పోటీచేస్తా … బీజేపీ నేత పొంగులేటి ….!

ఖమ్మం అసెంబ్లీకి పోటీచేస్తా … బీజేపీ నేత పొంగులేటి ….!
-ప్రధాని మోడీ .అమిత్ షా ఆధ్వరంలో తెలంగాణాలో బీజేపీదే అధికారం
-మోడీ పాలనా దక్షతను కొనియాడుతున్న ప్రపంచదేశాలు
-అగ్రదేశాల సరసన మొదటిసారిగా భారత్ కు స్థానం
-తెలంగాణాలో కేసీఆర్ కుటుంబ పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారు …
-ఖమ్మం జిల్లాలో పార్టీకి ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంది.
-నిరుద్యోగ ర్యాలీలో అది స్పష్టం అయింది

రానున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఖమ్మం టికెట్ ఇచ్చి పోటీచేయమంటే పోటీచేస్తానని బీజేపీ తమిళనాడు సహా ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలిపారు . ఆయన దేశ రాజకీయ పరిణామాలు మోడీ పాలనపై “దృక్పధంతో” పంచుకున్నారు . ప్రధాని నరేంద్ర మోడీ ,హోమ్ మంత్రి అమిత్ షా నాయకత్వంలో దేశంలో మంచి పరిపాలన అందిస్తున్నారని కొనియాడారు . గత 9 సంవత్సరాలుగా మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు . ప్రపంచదేశాలు అబ్బురపడేలా భారత దేశ కీర్తి పతాకం ఎగురుతుంది అన్నారు .గతంలో భారత్ అంటే చిన్న చూపు చుసిన దేశాలు భారత్ వైపు చూసేలా మోడీ చేశారని అనేక దేశాలు ఆయనకు ఆహ్వానాలు పలుకుతున్నాయని అన్నారు. గతంలో ఏ ప్రధాని తిరగనన్ని దేశాలు తిరిగి భారత దేశాల ప్రతిష్టను వినుమడింప జేశారని పేర్కొన్నారు .జి -20 దేశాలు సైతం మోడీ నాయకత్వ భాద్యతను గుర్తించి అధ్యక్ష భాద్యతలు అప్పగించారని అన్నారు .దేశంలో ప్రజల సంక్షేమం ,అభివృద్ధి బీజేపీ పాలనలోనే సాధ్యమని అన్నారు .

తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ యస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి మోసం చేసిందని అన్నారు .దళిత ముఖ్యమంత్రి , దళితులకు మూడెకరాలు ,బుట్టదాఖలయ్యాయని , ధరణి విఫలమైందని , కాళేశ్వరం అవినీతి మాయమైందని , కవిత లిక్కర్ స్కాం లో ఉన్నారని , తండ్రి ,కొడుకు అల్లుడు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని పొంగులేటి కేసీఆర్ పాలనపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు . అందువల్ల కేసీఆర్ ను ఇంటికి పంపాలని ప్రజలు నిర్ణయించుకున్నారని డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని కోరుకుంటున్నారని డాక్టర్ సుధాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఖమ్మం జిల్లాలో పార్టీని విస్తరణ కోసం కృషి చేస్తున్నామని ప్రత్యేకించి యువత బీజేపీ విధానాలకు ఆకర్షితులవుతున్నారని అన్నారు . బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని పొంగులేటి తెలిపారు ….

Related posts

రాజారెడ్డికే భ‌య‌ప‌డలేదు… జ‌గ‌న్‌కు భ‌య‌ప‌డ‌తామా?: నారా లోకేశ్!

Drukpadam

రేపు భద్రాచలంలో బీజేపీ జాతీయనాయకుడు పొంగులేటి

Ram Narayana

మ‌ళ్లీ మేమే అధికారంలోకి వ‌స్తాం: కేటీఆర్

Drukpadam

Leave a Comment