ఆంధ్రప్రదేశ్

కేసీఆర్‌కు కాంగ్రెస్ ఓ షాపింగ్ మాల్: బండి సంజయ్ ఆసక్తికర పోలిక

  • మక్తల్ లో బీజేపీ గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయన్న సంజయ్
  • కేసీఆర్ కు కోట్లాది రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని నిలదీత
  • ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదని వెల్లడి

కేసీఆర్ మరోసారి అధికారంలోకి వస్తే తెలంగాణలో రూ.10 లక్షల కోట్లు అప్పులు అవుతాయని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. వనపర్తి జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని, ప్రసంగించారు. మక్తల్ లో బీజేపీ గెలుస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయన్నారు. రాష్ట్రంలో పండే ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందన్నారు. కేసీఆర్ కు కోట్లాది రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని నిలదీశారు.

కాంగ్రెస్ అంటే ఓ దుకాణమని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ ఓ షాపింగ్ మాల్ అని, ఎప్పుడు అంటే అప్పుడు కాంగ్రెస్ అనే షాపింగ్ మాల్ నుండి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయవచ్చునని ఎద్దేవా చేశారు. తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదన్నారు.

Related posts

వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడికి మరో బిగ్ షాక్!

Ram Narayana

పోలవరం పై జగన్ రెడ్డి చేతులెత్తేశాడు …చంద్రబాబు

Ram Narayana

టీడీపీ ఎమ్మెల్యేకి బ్రిటన్ పార్లమెంటు అవార్డు…

Ram Narayana