Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

బీఆర్ యస్ పతనం ఖమ్మం నుంచే ప్రారంభం …రేవంత్ రెడ్డి…

బీఆర్ యస్ పతనం ఖమ్మం నుంచే ప్రారంభం …రేవంత్ రెడ్డి…
-జులై 2 న తెలంగాణ జన గర్జన సభలో పాల్గొననున్న రాహుల్ గాంధీ
-రాహుల్ గాంధీ సభ ఏర్పాట్లను పరిశీలించిన రేవంత్ రెడ్డి
-సభకు ఆటకం కల్గిస్తే అడ్డుగోడలు కూల్చివేస్తాం …
-అడ్డుకుంటే తొక్కిస్తాం …
-జనగర్జనలో బీఆర్ యస్ సభాకన్నా 10 తలలు ఎక్కువనే ఉంటాయి.
-ఏర్పాట్లు అద్భుతం …ఖమ్మంలో 10 కి 10 సీట్లు ఖాయం
-ఈసారి ఒంటికన్ను శివరాసన్ ను ఇంటికి పంపిస్తాం …
-ఖమ్మం కు రేణుక , భట్టి రెండు కళ్ళు , శీనన్న మూడవ కన్ను

తెలంగాణాలో చంద్రశేఖర్ రావు పాలనకు రోజులు దగ్గర పడ్డాయి. ఖమ్మం నుంచే బీఆర్ యస్ పతనం ప్రారంభం అవుతుంది. సభకు ఆటంకాలు కల్పిస్తున్నట్లు తెలుస్తుంది.అడ్డుకుంటే గోడలనైనా కూల్చి వేస్తాం …ఆటంకాలు కల్పిస్తే తొక్కేస్తాం అని హెచ్చరించారు . కొందరు యువకులు అంటున్నారు . వారు వాహనాలు ఇవ్వకపోయినా మాకు కాళ్ళు ఉన్నాయని అంటున్నారు . భట్టి విక్రమార్క 1300 కి .మీ యాత్ర చేసి స్ఫూర్తి నింపారు . మనం ఈ కొద్దీ దూరం నడవలేమా అని అన్నారు . వాళ్ళ ఆటంకాలను ప్రజలు గమనిస్తున్నారని వడ్డీతో సహా తీర్చుకుంటారని అన్నారు .

గతంలోనే ఖమ్మం ప్రజలు 10 సీట్లకు ఒక్క సీటే బీఆర్ యస్ కు ఇచ్చారు . ఇప్పుడు ఉన్న ఒంటికన్ను శివరాసన్ కూడా గెలవడు..ఇంటికి పోవడం ఖాయం అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీఆర్ యస్ పాలనపై కేసీఆర్ విధానాలపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు .జులై 2 ఖమ్మం లో జరగనున్న రాహుల్ గాంధీ పాల్గొననున్న జనగర్జన సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం సభాస్థలి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సభకు అధికార పార్టీ ఆటంకాలు కల్పించడం పై విమర్శలు గుప్పించారు . 15 వందల ఆర్టీసీ బస్సు లకోసం 2 కోట్ల రూపాయలు చెల్లించి తీసుకుంటామంటే ముందు సరే అన్న అధికారులు తర్వాత ప్రభుత్వ పెద్దల ఆదేశాలమేరకు ప్రధానంగా శాఖ మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ ఇవ్వొద్దన్నాడని అధికారులు చెపుతున్నారని ధ్వజమెత్తారు . ఇదేనా ఆర్టీసీ కి లాభం చేసే పద్దతి …మేము ఉచితంగా బస్సు లు తీసుకోవడంలేదు …నష్టాల్లో ఉన్న సంస్థను ఆదుకుందామని ,సిబ్బందికి మేలు చేద్దామని అనుకుంటే వారు నిరాకరించడం విడ్డురంగా ఉందని అన్నారు .

జిల్లాకు పొంగులేటి మూడో కన్ను …

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో ఒక కన్ను రేణుక చౌదరి అయితే మరో కన్ను సీఎల్పీ నేత భట్టి అని మూడు కన్ను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అని రేవంత్ రెడ్డి అన్నారు . మూడవ కన్ను పవర్ ఎలా ఉంటుందో తెలుసుగా అని చమత్కరించారు …జిల్లాలో ఎలాంటి విభేదాలు లేకుండా అందరు ఒక్కటై పని చేయాలనీ అందుకు ఏఐసీసీ కూడా పరిశీలకులను పంపుతుందని అన్నారు . సభ నిర్వహణ కోసం పొంగులేటి తోడుగా ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతలు కాకుండా ఏఐసీసీ బృందం ఒకటి ఉంటుందని పేర్కొన్నారు .

రేవంత్ వెంట ఏఐసీసీ పరిశీలకులు రోహిత్ చౌదరి , రాష్ట్ర నాయకులు మధు యాష్కీ , వి .హనుమంతరావు ,సీతక్క , బలరాం నాయక్ ,పొదెం వీరయ్య , మహేష్ కుమార్ , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు .

Related posts

గ్రూప్-1 పరీక్ష.. అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక సూచనలు…

Ram Narayana

ఏపీ లో పెట్రో ధరలు తగ్గించాల్సిందే …ఆందోళనలకు చంద్రబాబు పిలుపు ….

Drukpadam

బీజేపీ ప్రజలకు ఏంచేయలేకపోయింది: సంజయ్ రౌత్….

Drukpadam

Leave a Comment