Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

పార్టీ మార్పుపై నాలాంటి వాడిని పదే పదే ప్రశ్నించకండి: ఈటల

పార్టీ మార్పుపై నాలాంటి వాడిని పదే పదే ప్రశ్నించకండి: ఈటల

  • పార్టీ మారడం అంటే బట్టలు మార్చినంత ఈజీ కాదని వ్యాఖ్యలు
  • కేసీఆర్ పై వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం అని వెల్లడి
  • కేసీఆర్ కు అన్ని పార్టీల్లో కోవర్టులు ఉన్నారని వ్యాఖ్యలు 

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పార్టీ మారుతున్నారంటూ గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై మీడియా ప్రతినిధులు నేరుగా ఈటలనే అడిగారు. అందుకు ఈటల బదులిస్తూ… పార్టీ మార్పు అంటూ తన లాంటి వాడ్ని పదే పదే ప్రశ్నించకూడదని అన్నారు.

పొద్దున ఒక వార్త, మధ్యాహ్నం ఒక వార్త, సాయంత్రం ఇక వార్త… రోజుకొక వార్త… ఇన్ని వార్తలకు నాలాంటి వాడు సమాధానం చెప్పగలడా? అని వ్యాఖ్యానించారు. రాసేవాళ్లు రాస్తుంటారని, కానీ పార్టీ మారడం అంటే బట్టలు మార్చినంత ఈజీ కాదని ఈటల పేర్కొన్నారు.

అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ఆత్రుతగా ఉందని, అంతా అయిపోతోందంటూ వార్తలతో హైప్ సృష్టిస్తోందని, అదే నిజం అని కాంగ్రెస్ భావిస్తే పొరబాటేనని ఈటల వివరించారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్ పై వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం అని, అయితే ఈ వ్యతిరేకతను ఏ పార్టీ సొమ్ము చేసుకుంటుందో చూడాలని అన్నారు. కేసీఆర్ అన్ని పార్టీలలో కోవర్టులను పెట్టుకున్నాడని పేర్కొన్నారు.

Related posts

ఉత్తర‌ప్ర‌దేశ్ సీఎం అభ్య‌ర్థిగా ప్రియాంకా గాంధీ?..

Drukpadam

కాంగ్రెస్ పార్టీకి పవర్ ఇస్తే రైతులకు పవర్ కట్ ఖాయం …మంత్రి పువ్వాడ..

Drukpadam

మీట్ ద ప్రెస్ లో రాజ్యహింస గురించి వివరించిన ప్రొఫెసర్ సాయిబాబా …

Ram Narayana

Leave a Comment