ఆంధ్రప్రదేశ్

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నియామకం!

  • కిషన్ రెడ్డిలకు తెలుగు రాష్ట్రాల నాయకత్వ బాధ్యతలు
  • జేపీ నడ్డా పేరిట వెలువడిన ఉత్తర్వులు
  • ఎపీ బీజేపీ అధ్యక్షురాలుగా పురంధరేశ్వరి
  • ఊహించని విధంగా పురందేశ్వరిని వరించిన కీలక పదవి

ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. సోము వీర్రాజును అధ్యక్ష పదవి నుంచి తొలగించిన పార్టీ హైకమాండ్ పురందేశ్వరికి రాష్ట్ర నాయకత్వ బాధ్యతలను అప్పగించింది. అధ్యక్ష పదవి రేసులో సత్యకుమార్, సుజనా చౌదరి పేర్లు వినిపించినప్పటికీ… చివరకు ఊహించని విధంగా ఆ పదవి పురందేశ్వరికి దక్కింది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని అధిష్ఠానం నియమించింది. పురందేశ్వరి, కిషన్ రెడ్డిలను తెలుగు రాష్ట్రాలను అధ్యక్షులుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించినట్టు అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి.

బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గా ఈటెల..

హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను తెలంగాణ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ నియమిస్తు అధిస్టానం ఉత్తర్వుల జారీచేసింది..

Related posts

కొందరు ఐఏఎస్ ,ఐపీఎస్ అధికారులను కలిసేందుకు అనుమతించని సీఎం చంద్రబాబు ..

Ram Narayana

ఎన్టీఆర్ పుట్టిన రోజు ఇక రాష్ట్ర పండుగ …ఏపీ ప్రభుత్వం అధికారిక ప్రకటన…

Ram Narayana

ప్రపంచంలో అత్యంత మంట పుట్టించే మిరపకాయ ఇదే..!

Ram Narayana