Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

జగన్, పొంగులేటి భేటీ …వ్యాపారమా …? రాజకీయమా …??

చర్చకు దారితీసిన ఏపీ సీఎం జగన్ తో పొంగులేటి కలయిక
వ్యాపారమా …? రాజకీయమా …?
తెలంగాణ కాంగ్రెస్ నేత ఏపీ సీఎం ను కలవడమేమిటి
చేరిన నాలుగు రోజులకే కలయికతో అనేక సందేహాలు
షర్మిల రాజకీయ రంగప్రవేశం గురించి చర్చించారా …?

జులై 2 న ఖమ్మం లో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ జనగర్జన సభలో రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరిన ఖమ్మం మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
గత మూడు నాలుగు రోజులుగా హైద్రాబాద్ లో బిజీ బిజీ గా గడిపారు . వివిధ మీడియా ఛానళ్ల ఇంటర్వ్యూ లలో మాట్లాడారు . గురువారం హుటాహుటిన తాడేపల్లి వెళ్లి ఏపీ సీఎం జగన్ ను కలుసుకున్నారు . ఇది సాధారణ కలయికే అని పొంగులేటి అనుయాయులు చెపుతున్నప్పటికే అనేక సందేహాలకు తావిచ్చింది వీరి కలయిక …ఏపీలో తమ కంపెనీలకు కాంట్రాక్టులు ఉన్నప్పటికీ ఇంత ఆదరాబాదరాగా కలవాల్సి పనేమిటి ఇది నిజంగా వ్యాపార కలయకా…? లేక రాజకీయమా…? అనేది చర్చినీయాంశంగా మారింది. రెండు రాష్ట్రాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది. దీనిపై పొంగులేటి ఏవిధంగా స్పందిస్తారో ననే ఉత్కంఠత ఏర్పడింది …

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జగన్ తోమంచి సంబంధాలు ఉన్నాయి… ఆయన రాజకీయ అరంగేట్రం జగన్ పార్టీతోనే జరిగింది. ఆ పార్టీ నుంచే ఖమ్మం ఎంపీగా 2014 ఎన్నికల్లో విజయం సాధించారు . ఏ పార్టీలో ఉన్నా ఆయన్ను తరచూ కలుస్తుంటాడు …బీఆర్ యస్ లో ఉండగా కూడా పొంగులేటి అనేక సార్లు కలిశారు . అయితే ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీనివాస్ రెడ్డి , జగన్ తో కలవడాన్ని కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తుందా ..? అభ్యంతరం చెపుతుందా ..? అసలు కలయిక ఉద్దేశం ఏమిటి ..? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది .

వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరికపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారని గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజంగా ఆమె పార్టీలో చేరుతున్నారా ? లేదా..? అని జగన్ ఆరాతీసినట్లు తెలుస్తుంది. దీనిపై తన వద్ద ఉన్న సమాచారాన్ని జగన్ తో పంచుకున్నట్లు వినికిడి .. అయితే పొంగులేటి, సీఎం జగన్ తో భేటీ వ్యక్తిగతమని, రాజకీయాలకు సంబంధించి చర్చ జరగలేదని ఆయన అనుచరులు అంటున్నారు. రాజకీయాలకు ఈభేటీకీ సంబంధమే లేదని కొట్టిపారేస్తున్నారు .

ఏపీలో త్వరలోనే వ్యవసాయ మోటార్లు, నివాస గృహాలకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటుచేయనున్నారు. ఇందుకు దక్షిణ, మధ్య డిస్కమ్‌లలో టెండర్లు ఖరారయ్యాయి. రాఘవ కన్‌స్ట్రక్షన్స్, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ కంపెనీలకు రూ.4,592 కోట్ల విలువైన టెండర్లను అప్పగించినట్లుగా సమాచారం. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సంబంధించి రూ.2056.95 కోట్ల విలువైన పనులను రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు దక్కించుకుంది. ఉత్తారంధ్రలో పొంగులేటికి చెందిన రాఘవ కన్ స్ట్రక్షన్స్ పలు ప్రాజెక్టులు చేస్తుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన కంపెనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన పలు కంపెనీలు ఏపీలో పలు ప్రాజెక్టులు చేస్తున్నాయి. కడపలో వరదల ధాటికి కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణ పనులు పొంగులేటి కంపెనీ చేస్తుంది. రూ.660 కోట్లకు ఈ టెండర్‌ ఖరారైంది.

సీఎం జగన్ తో విభేదిస్తా…పొంగులేటి

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పొంగులేటి మాట్లాడుతూ… అధిష్టానం ఏపీ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేసిన ఆయన.. పార్టీలో తనకు ఏ బాధ్యతలు అయినా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు . అవసరమైతే సీఎం జగన్‌తో విభేదిస్తానని స్పష్టం చేశారు. వ్యాపారాలకు, రాజకీయాలకు సంబంధం లేదన్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత సరిగ్గా లేరని కేసీఆర్ విమర్శలు చేశారు. అయితే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తనకు అక్రమంగా ఏ ఒక్క కాంట్రాక్ట్‌ కూడా ఇవ్వలేదని స్పష్టంచేశారు. తాను చేసిన కాంట్రాక్టులు అన్ని పద్దతి ప్రకారం టెండర్లలో వచ్చినవేనని పేర్కొన్నారు . కాంగ్రెస్‌ అధిష్టానం ఏపీలో అభివృద్ధి కోసం ఏ చిన్నపాటి బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్ధితో చేస్తానని పొంగులేటి అన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు .

Related posts

బీజేపీ టార్గెట్ గా హైదరాబాద్ లో హోర్డింగ్స్

Drukpadam

కాంగ్రెస్ మాతో కలవాలంటే బెంగాల్‌లో ఇలా చేయాలి: మమత మెలిక

Drukpadam

మెత్త బడ్డ సిద్దు రాజీనామా వెనక్కి …? సీఎం తో భేటీ …

Drukpadam

Leave a Comment