Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

డీకే అరుణ కుమార్తె క్రెడిట్ కార్డు చోరీ.. రూ. 11 లక్షలు కొట్టేసిన వైనం

  • బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో నివాసం ఉంటున్న శ్రుతిరెడ్డి
  • గత డిసెంబర్ నుంచి ఆమె వద్ద డ్రైవర్ గా పని చేస్తున్న బీసన్న
  • మహావీర్ జెమ్స్ అండ్ పెరల్స్ లో స్వైప్ చేసి రూ. 11 లక్షలు వాడుకున్న వైనం

బీజేపీ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ కూతురు డీకే శ్రుతిరెడ్డి నమ్మిన వ్యక్తి చేతిలోనే మోసానికి గురయ్యారు. ఆమె వద్ద డ్రైవర్‌గా పని‌ చేస్తున్న వ్యక్తి క్రెడిట్ కార్డును దొంగిలించి లక్షల రూపాయలు కొట్టేశాడు. శ్రుతి బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 14లోని ప్రేమ్ పర్వత్ విల్లాస్‌లో ఉంటున్నారు. ఆమె వద్ద గత డిసెంబర్ నుంచి బీసన్న అనే వ్యక్తి డ్రైవర్‌గా పని‌ చేస్తున్నాడు. 

ఇటీవల ఆమెకు చెందిన క్రెడిట్ కార్డును దొంగిలించిన బీసన్న… శ్రీమహావీర్ జెమ్స్ అండ్ పెరల్స్‌లో స్వైప్ చేసి రూ. 11 లక్షలు వాడుకున్నాడు. ఈ విషయాన్ని శ్రుతి ఆలస్యంగా గ్రహించారు. బీసన్నపై అనుమానం వచ్చి ఆయనను నిలదీసినప్పటికీ… తాను ఆ పని చేయలేదని చెప్పాడు. దీంతో, డ్రైవర్‌పై బంజారాహిల్స్ పోలీసులకు శ్రుతి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బీసన్నపై ఐపీసీ 420, 408 కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

రేవంత్ రెడ్డిపై సోనియాకు ఫిర్యాదు… ఆయన కూడా సీరియస్ ?

Drukpadam

పసివాడి జబ్బుకు రూ.16 కోట్ల ఇంజెక్షన్ :అండగా నిలిచిన ప్రపంచం

Drukpadam

జగన్‌తో సెల్ఫీ దిగిన మహిళా కానిస్టేబుల్‌కు మెమో!

Ram Narayana

Leave a Comment