Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

వార్తలలో వ్యక్తి కృష్ణపట్నం ఆనందయ్య …..

వార్తలలో వ్యక్తి కృష్ణపట్నం ఆనందయ్య …..
-ఆయన ఇచ్చే నాటుమందు పై ప్రపంచవ్యాపితంగా చర్చ
-ముందు జాగ్రత్తగా మందును పరిశీలించిన ఏపీ ఆయుష్ శాఖ
-ఆ మందుతో ప్రాణహాని లేదని తేల్చిన వైనం
-ఆమందు వాడినవారు ఎక్కడ నెగిటివ్ చెప్పలేదు
-ఆయన్ను అరెస్ట్ చేశారంటూ పుకార్లు
-జనంలో గందరగోళం -మందు పంపిణి ఆపేస్తున్నారంటూ ప్రచారం
-మందుపై పరీక్షలు -అది ఆయుర్వేదంకాదు నాటు మందు అని నిర్దారణ
-శాస్త్రీయతపై కాకుండా నమ్మకంపై ఆధారపడి మందు తీసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటన
-ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు , ముఖ్యమంత్రి ఆరా

-ఆనందయ్య మందుపై సిపిఐ నారాయణ , ఎమ్మెల్యే కాకాని ల స్పందన

నెల్లూరు జిల్లా లోని కృష్ణపట్నంకు చెందిన బొనిగ ఆనందయ్య ఇప్పడు తెలుగు రాష్ట్రాలలో ఇంటిపేరు కృష్ణపట్నం ఆనందయ్య గా మారింది. ఆయన పేరు మారుమోగుతోంది . తెలుగు రాష్ట్రాలే కాదు ఒకరకంగా చెప్పాలంటే ప్రపంచవ్యాపితంగా ఆయన ఫెమస్ అయ్యాడు . కారణం వేరే చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని తాను ఇంట్లో తయారు చేసిన నాటు పసరమందు తో నయం చేస్తున్నదన్న ప్రచారం . అందరి చూపు కృష్ణపట్నం వైపు మరలెలా చేసింది. రోజుకు పదులతో ప్రారంభమైన ఆయన నాటు మందు పంపిణి వందలు వేలు వరకు చేరింది. అంబులెన్సులు సైతం కృష్ణపట్నంకు క్యూకట్టాయి. దవాఖానాలు ఖాళీఅయ్యాయి. చీకటిలో చిరుదీపంలాగా ఆయన మందు ప్రాణాలు పోస్తుందని ఆక్సిజన్ అందిస్తుందని కొన్ని నిమిషాల్లోనే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతున్నాయని స్వయంగా మందులు వాడిన అనేకమంది చెప్పటంతో ఇక మొత్తం రోడ్లు అన్ని కృష్ణపట్నం దారిపట్టాయి . ఆయన ఇచ్చే నాటుమందు పై ప్రపంచవ్యాపితంగా చర్చ జరుగుతుంది. ఆయన నాటు ముందుకు కరోనా పారిపోతుందని జరుగుతున్నా ప్రచారంతో కార్పొరేట్ శక్తులు వణికి పోయాయి. పాలకులకు మండపంపిణీ చేయకుండా నిలిపి వేయాలనే వత్తిడి పెరిగిందనే వార్తలు వచ్చాయి. వాస్తవానికి దీనిపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ , ఆయుష్ శాఖలు రంగంలోకి దిగాయి .ప్రాధమిక విచారణ జరిపాయి. అందులో మందులు తీసుకుంటున్న ప్రజలనుంచి ఎలాంటి నెగిటివ్ లేకపోవడంతో జిల్లా కలెక్టర్ కు పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి సైతం ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్నా ప్రరిణామాలను రాష్ట్రప్రభుత్వ దృష్టికి ముఖ్యంమత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తెచ్చారు. దీనిపై అప్రమత్తమైన రాష్ట్రప్రభుత్వం ఆయుష్ విభాగం కమిషనర్ కర్నల్ రాములును రంగంలోకి దింపింది. మందు మంచిదా చెడ్డదా అని నిర్దారించుకునేందుకు దానిలో వాడే పదార్ధాలను పరీక్షలకు పంపించారు. ఆనందయ్య నుంచి వివరణ కోసం పిలిపించారు. ఇంకేముందు మీడియా లో ఆయన్ను అరెస్ట్ చేశారని పెద్ద వెత్తున వార్తలు వచ్చాయి. మందు పంపిణి ఆపేస్తున్నారంటూ ప్రచారం తో ప్రజల్లో గందరగోళం నెలకొన్నది . కృష్ణపట్నం లో వేలాదిగా ప్రజల పడిగాపులు దేశవ్యాపితంగా తెలుగు రాష్ట్రాలలో ఏపీ ప్రభుత్వంపై మండిపాటు .చివరకు ఆమందు పై జరిపిన పరీక్షలలో దానిని వాడటం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని నిర్దారణ జరగటంతో ఊపిరీపిల్చుకున్నారు. కానీ అది ఆయుర్వేదం కాదని నాటు మందు అని ప్రకటించారు. మందు శాస్త్రీయతపై కాకుండా నమ్మకంపై ఆధారపడి మందు తీసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. దానిని వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని ప్రకటించింది. దీనిపై నెల్లూరు జిల్లాకే చెందిన భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు , ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు ఆరా తీశారు. ఆయన మండపంపిణీ పై గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టారు. అది ఆయుర్వేదం కాదని నాటు మందు అని తేల్చారు. దాని వాడకం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని నిర్దారించారు. నమ్మకం పై వాడవచ్చునని ప్రకటించారు.

 

 

ఆనందయ్య మందుపై కార్పొరేట్ ఆసుపత్రుల గోల ఎక్కువైంది: సీపీఐ నారాయణ

  • తీవ్ర చర్చనీయాంశంగా ఆనందయ్య మందు
  • కృష్ణపట్నంలో పర్యటించిన నారాయణ
  • మందు పంపిణీ కేంద్రం పరిశీలన
  • సైడ్ ఎఫెక్ట్స్ లేవని వ్యాఖ్యలు
  • ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలని సూచన
CPI Narayana visits Krishnapatnam

ఏపీలో ఇప్పుడు ఆనందయ్య కరోనా మందు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో పర్యటించారు. ఆనందయ్య మందు పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడి పరిస్థితులపై ఆరా తీసిన నారాయణ మీడియాతో మాట్లాడుతూ, ఆనందయ్య కరోనా మందు తీసుకున్నవారిలో ఎలాంటి దుష్ఫలితాలు కనిపించలేదని అభిప్రాయపడ్డారు.

కానీ ఆనందయ్య మందుపై కార్పొరేట్ ఆసుపత్రుల గోల ఎక్కువైందని అన్నారు. ఇలాంటి మందులపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. కోటయ్య స్టెరాయిడ్స్ వాడడం వల్లే అస్వస్థతకు గురయ్యాడని పేర్కొన్నారు. ఆనందయ్య మందులో ఎలాంటి హానికర పదార్ధాలు లేవని తెలిసిందని అన్నారు.

 

ఆనందయ్యను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది?: ఎమ్మెల్యే కాకాణి

  • ఆనందయ్య మందుపై కాకాణి స్పందన
  • ఆనందయ్యను ఎవరూ అరెస్ట్ చేయలేదని వెల్లడి
  • మందుపై అధ్యయనం జరుగుతోందని వివరణ
  • ప్రభుత్వ విధివిధానాలు వస్తే పంపిణీ ఉంటుందని స్పష్టీకరణ
YCP MLA Kakani Govardhan Reddy comments in Anandaiah corona medicine

నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆనందయ్య కరోనా మందు అంశంపై స్పందించారు. ఆనందయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోందని అన్నారు. ఆనందయ్యను ఎవరూ అరెస్ట్ చేయలేదని, ఆయనను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

గత కొన్నిరోజుల వరకు ఆనందయ్య మందు కోసం జనాలు ఎగబడ్డారని కాకాణి వెల్లడించారు. అయితే, ప్రస్తుతం మందుపై అధ్యయనం జరుగుతోందని, ప్రభుత్వ విధివిధానాలు వచ్చిన తర్వాతే మందు పంపిణీ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజల డిమాండును బట్టి పెద్ద ఎత్తున మందు తయారు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తమది మెడికల్ మాఫియాకు లొంగే ప్రభుత్వం కాదని కాకాణి స్పష్టం చేశారు.

అటు, ఆయుష్ విభాగం ఆనందయ్య తయారుచేసే మందు ఆయుర్వేదం కాదని, నాటు మందు అని పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై ఆనందయ్య స్పందించారు. తనది ఆయుర్వేద మందేనని ఉద్ఘాటించారు. ప్రజలకు మేలు చేసేందుకే మందు తయారుచేశానని స్పష్టం చేశారు. తమ ఔషధం పట్ల సీఎం జగన్ సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోందని, ప్రభుత్వం ఏంచెబితే అది చేస్తామని పేర్కొన్నారు.

ఇక, హెడ్ మాస్టర్ కోటయ్య గురించి చెబుతూ, ఆయనకు మందు ఇచ్చి నాలుగు రోజులైందని, తన మందు వల్లే కోటయ్య ఇబ్బందిపడ్డారని చెప్పలేమని ఆనందయ్య అన్నారు. తన మందును కొందరు విక్రయించే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వారిని కట్టడి చేయాలని కోరారు.

Related posts

కరోనా టీకాతో అయస్కాంత శక్తులంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన కేంద్రం…

Drukpadam

తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ మరో వారం రోజులు పొడిగింపు…

Drukpadam

దుబాయ్ నుండి డిల్లీకి వచ్చిన పదిమందికి ఒమైక్రాన్…

Drukpadam

Leave a Comment