Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
https://youtu.be/eGLBanEzKTo
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

పులి కడుపున పులే పుడుతుంది.. మీ బిడ్డగా సేవ చేస్తా: పాలేరులో షర్మిల…

-ఇడుపులపాయ నుండి పాలేరుకు వైఎస్ షర్మిల

-ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ సేవలతో వైఎస్ పాలన తీసుకువస్తానని వ్యాఖ్య

-త్వరలో పాలేరులో పాదయాత్రను ప్రారంభిస్తానని వెల్లడి

పాలేరు ప్రజల సాక్షిగా… పాలేరు మట్టి సాక్షిగా… ఈ రాజశేఖరరెడ్డి బిడ్డ పాలేరుకు రాజశేఖరరెడ్డి గారి పాలనను  అందిస్తానని మాట ఇచ్చిందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. శనివారం ఉదయం ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్సార్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకొని, అక్కడి నుండి పాలేరుకు వెళ్లారు. పాలేరులో వైఎస్ 74వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ… త్వరలో పాలేరులో పాదయాత్రను ప్రారంభించి, ఇక్కడే ముగిస్తానని చెప్పారు.

రైతులకు అండగా నిలబడతానని, ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టిస్తానని, పేద బిడ్డల ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీలతో దివంగత ముఖ్యమంత్రి పాలనను తీసుకు వస్తానని చెప్పారు. నేను మళ్లీ చెబుతున్నా.. రాజశేఖరరెడ్డి బిడ్డను.. పులి కడుపున పులే పుడుతుంది.. మీ బిడ్డగా మీకు నమ్మకంగా సేవ చేస్తానన్నారు. రాజశేఖరరెడ్డి సంక్షేమ పాలన ప్రతి గడపకు చేరుస్తానని మాట ఇస్తున్నానన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,800 కిలో మీటర్లు పాదయాత్ర చేశానని, త్వరలో మళ్లీ ఆ పాదయాత్రను పాలేరులో కొనసాగించి 4000 కిలో మీటర్లు పూర్తి చేసి ఇక్కడే ముగిస్తానన్నారు.

రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపిన వైఎస్ షర్మిల…

  • నేడు వైఎస్సార్ జయంతి
  • నివాళులు అర్పించిన రాహుల్ గాంధీ
  • ఏపీ ప్రజల అభ్యున్నతి కోసం జీవితాన్ని అంకితం చేశారని వెల్లడి
  • వైఎస్సార్ ను మీ గుండెల్లో నిలుపుకున్నందుకు ధన్యవాదాలు అంటూ షర్మిల ట్వీట్
YS Sharmila thanked Rahul Gandhi

నేడు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. వైఎస్సార్ దార్శనికత ఉన్న నాయకుడు అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు అని కీర్తించారు. వైఎస్సార్ చిరస్మరణీయ నేత అని అభివర్ణించారు. ఈ మేరకు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

దీనిపై వైఎస్సార్ తనయ షర్మిల స్పందించారు. వైఎస్సార్ పట్ల ఎంతో ప్రేమాభిమానాలతో స్పందించిన రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్నందుకు ధన్యవాదాలు అంటూ షర్మిల ట్వీట్ చేశారు. ప్రజాసేవ కోసం నిబద్ధతతో పనిచేసిన కాంగ్రెస్ నేత డాక్టర్ వైఎస్సార్ అని పేర్కొన్నారు. చివరి క్షణం వరకు ప్రజాసేవలోనే గడిపారని అన్నారు.

ముఖ్యంగా మీ (రాహుల్) నాయకత్వంలో దేశానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని నమ్మారని వివరించారు. నాడు వైఎస్ అమలు చేసిన పథకాలే ఈ రోజుకూ కూడా దేశవ్యాప్తంగా సంక్షేమ పాలనకు మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయని షర్మిల గర్వంగా తెలిపారు. డాక్టర్ వైఎస్సార్ ను ఇంకా మీ గుండెల్లో నిలుపుకున్నందుకు థాంక్యూ సర్ అంటూ రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

బండి ఇలాఖాలో అసమ్మతి గళం: రహస్య సమావేశం.. హై కమాండ్ ఆరా!

Drukpadam

నేడు కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఆశల పల్లకిలో తెలుగు ఎంపీలు…

Drukpadam

కుప్పంలో భరత్ ను గెలిపిస్తే మంత్రిగా చేస్తా:  సీఎం జగన్ ప్రకటన

Drukpadam

Leave a Comment