బీఆర్ యస్ బీజేపీకి అనుకూలమైతే రాజీనామా చేస్తా…మంత్రి పువ్వాడ…
–అప్పుడు ఇప్పుడు, ఎప్పుడైనా దానికే కట్టుబడి ఉంటా ..
–బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీ బీఆర్ యస్
–మా చిత్తశుద్ధిని ఎవరు శంకించలేరు
–పౌరస్మృతికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నది కేసీఆర్
–మా నరనరాన సెక్యూలర్ భావాలు ఉన్నాయి
–బీజేపీకి ఎవరు బీటీమ్ అనేది ముందు ,ముందు తెలుస్తుంది…
బీఆర్ యస్ నిజమైన సెక్యూలర్ పార్టీ …మా నాయకుడు కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా నిక్కచ్చిగా పోరాడుతున్నాడు …మా చిత్త శుద్ధిని ఎవరు శంకించలేరు …మా నరనరాన సెక్యూలర్ భావాలు ఉన్నాయి. గతంలో చెప్పా ఇప్పుడు చెపుతున్న బీఆర్ యస్ బీజేపీకి అనుకూలమైతే మంత్రి పదవికి రాజీనామా చేస్తాఅని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ విధానాలపై మంత్రి ఫైర్ అయ్యారు .ఉమ్మడి పౌరస్మృతి పేరుతో బీజేపీ దేశంలో అన్నదమ్ముల్లా ఉన్న హిందూ ,ముస్లిం ఇతర మతాల మధ్య తగాదాలు పెట్టి లబ్ది పొందే ప్రయత్నం చేస్తుందని ధ్వజమెత్తారు .బీజేపీ కులమత ,విచ్చిన్నకర రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకున్నారని అన్నారు. అందుకే వచ్చే లోకసభ ఎన్నికల్లో గెలవలేమని నిర్ణయానికి వచ్చిన బీజేపీ ఎదో విధంగా ప్రజలను రెచ్చెగొట్టే చర్యలను తీసుకోని ముందుకు వస్తుందని దీన్ని ప్రజలు గమనించాలని అన్నారు .ఆపార్టీకి దక్షిణాదిన చోటులేదు …ఉత్తరాదిన సీట్లు తగ్గుతాయని ఆపార్టీ నేతలే అంగీకరిస్తున్నారు .అందువల్ల ప్రజల సమస్యలను గాలికి వదిలి పెట్టి ఎన్నికల రాజకీయాలకు తెరలేపారని అన్నారు.
కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ పాలన మరోసారి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అందువల్లనే కాంగ్రెస్ పార్టీకి పాలుబోక ఎలాగూ అధికారంలోకి రామనే ఉద్దేశ్యంతో పిచ్చిప్రేలాపనలు పేలుతుందని అన్నారు .కాంగ్రెస్ ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా, వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని పువ్వాడ విశ్వాసం వ్యక్తం చేశారు . ఉచిత విద్యత్ పథకం దేశంలోనే ప్రసంశలు పొందుతుంటే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉచితం పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తో కాంగ్రెస్ కు రైతులపట్ల ఉన్న చులకన భావాన్ని తెలియజేస్తుందని అన్నారు .కాంగ్రెస్ కు పొరపాటున అధికారం అప్పగిస్తే రాష్ట్రం అధోగతిపాలు అవుతుందని మంత్రి పువ్వాడ హెచ్చరించారు …