- కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా పై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు సంచలన తీర్పు …
- తక్షణమే తీర్పు అమలు …2018 లో జలగం హైకోర్టు లో పిటిషన్
- వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించిన హైకోర్టు
- కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమాకు షాక్
- వనమా ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు
- రెండో స్థానంలో ఉన్న జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించిన హైకోర్టు
- 5 లక్షల రూపాయల జరిమానా విధించిన కోర్ట్
- కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావుకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. వనమా ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదని సంచలన తీర్పును వెలువరించింది. అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. 2018 నుంచి ఇప్పటి వరకు వనమా ఎమ్మెల్యే పదవీకాలం చెల్లదని స్పష్టం చేసింది. ఎన్నికల అఫిడవిట్ లో వనమా తప్పుడు వివరాలను ఇచ్చారంటూ 2018లో హైకోర్టును జలగం వెంకట్రావు ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై సుదీర్ఘంగా విచారణ జరిపిన హైకోర్టు వనమా ఎన్నిక చెల్లదని తీర్పును వెలువరించింది. అంతేకాదు, ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు రూ. 5 లక్షల జరిమానా విధించింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున వనమా గెలిచారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ లో చేరారు. వనమా ఎన్నికపై నాటినుంచి మాజీఎమ్మెల్యే జలగం వెంకట్రావు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు . 4 సంవత్సరాల తర్వాత తీర్పు వెలువడింది. సుదీర్ఘ తన న్యాయపోరాటం ఫలించిందని వెంకట్రావు పేర్కొన్నారు .
- శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదని గతంలోనే తీర్పు … తన పై ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఒకేరోజు ఇద్దరు ఎమ్మెల్యేలపై తీర్పులు రావడం వారు అధికార బీఆర్ యస్ పార్టీ వారు కావడం గమనార్హం …
next post