Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలు

మణిపూర్ హింసను ఖండిస్తూ.. మిజోరంలో రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపిన మిజోరం సీఎం, మంత్రులు

  • రాజధాని ఐజ్వాల్‌లో వీధుల్లోకి వచ్చిన వేలాదిమంది
  • కార్యాలయాలు మూసేసిన రాజకీయ పార్టీలు
  • మణిపూర్ బాధితులను పరామర్శించిన ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలీవాల్
  • రెండ్రోజుల వ్యవధిలో మయన్మార్ నుంచి మణిపూర్‌లోకి అక్రమంగా 718 మంది

మణిపూర్‌లో రెండు నెలలుగా కొనసాగుతున్న హింసను ఖండిస్తూ పొరుగు రాష్ట్రం మిజోరంలో వేలాదిమంది నిన్న వీధుల్లోకి వచ్చి సంఘీభావం ప్రకటించారు. ముఖ్యమంత్రి జొరాథంగా, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ శాంతియుత ప్రదర్శనల్లో పాల్గొన్నారు. రాజధాని ఐజ్వాల్‌లో జరిగిన ఈ నిరసన ప్రదర్శన ద్వారా మణిపూర్‌కు సంఘీభావం ప్రకటించారు. మద్దతుగా రాజకీయ పార్టీలన్నీ తమ కార్యాలయాలను మూసివేశాయి. 

బాధితులకు కేంద్రం పరిహారం ఇవ్వాలని, దోషుల్ని కఠినంగా శిక్షించాలని ప్రదర్శనకారులు డిమాండ్ చేశారు. మరోవైపు, ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలీవాల్ నిన్న మణిపూర్‌లో బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తానే వచ్చి బాధితులను కలవగలిగినప్పుడు ప్రధానమంత్రి, మణిపూర్ ముఖ్యమంత్రి బాధితులను ఎందుకు పరామర్శించలేకపోయారని ప్రశ్నించారు.

మరోవైపు, మణిపూర్‌లోని తాజా పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటున్న కొందరు మయన్మార్ వాసులు రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడుతున్నారు. రెండ్రోజుల వ్యవధిలో ఏకంగా 718 మంది అక్రమంగా ప్రవేశించారు. వీరిలో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. మణిపూర్ ఆందోళనకారులకు మయన్మార్ నుంచే ఆయుధాలు సరఫరా అవుతున్నట్టు గత నెలలో నిఘా సంస్థలు గుర్తించాయి. రాష్ట్రంలో దాదాపు మూడు నెలలుగా బ్రాడ్‌బ్యాండ్ సేవలపై కొనసాగుతున్న నిషేధాన్ని కొన్ని షరతులతో పాక్షికంగా సడలించారు. మొబైల్ ఫోన్లలో మాత్రం ఇంటర్నెట్‌పై ఆంక్షలు కొనసాగుతున్నాయి.

కొండ మీదకు తీసుకెళ్లి రాత్రంగా ఏమేం చేయాలో అన్నీ చేశారు: గ్యాంగ్ రేప్ కు గురైన మణిపూర్ మహిళ

  • మణిపూర్ లో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న దారుణాలు
  • 19 ఏళ్ల గిరిజన మహిళపై దారుణంగా సామూహిక అత్యాచారం
  • ఏటీఎం వద్ద నుంచి బాధితురాలిని కిడ్నాప్ చేసిన దుండగులు
Raped me after taking to hill area says Manipur woman

జాతుల మధ్య వైరంతో మణిపూర్ అల్లాడుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, ఆ తర్వాత వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ అంశంపై పార్లమెంటు ఉభయసభలు సైతం అట్టుడుకుతున్నాయి. మరోవైపు 19 ఏళ్ల ఓ గిరిజన మహిళ అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి గురయింది. ఆనాడు (మే 15న) తాను అనుభవించిన నరకయాతనను ఆమె ఓ జాతీయ మీడియాతో పంచుకుంది. 

అప్పటికే మణిపూర్ లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. హింస పెద్ద స్థాయిలో ప్రజ్వరిల్లుతోంది. దీంతో, ఎంతో మంది తమ ప్రాంతాల నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. 19 ఏళ్ల బాధితురాలు కూడా తాను ఉంటున్న ప్రాంతం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఆమె ఏటీఎంకు వెళ్లింది. అక్కడ ఆమెను కొందరు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఆమె చెప్పిన వివరాల ప్రకారం…

“తెల్ల రంగు బొలెరో వాహనంలో నన్ను నలుగురు తీసుకెళ్లారు. ఒక కొండ ప్రాంతానికి తీసుకెళ్లారు. డ్రైవర్ మినహా మిగిలిన ముగ్గురు నాపై సామూహిక అత్యాచారం చేశారు. గన్ బట్ తో నన్ను కొట్టారు. నీళ్లు, ఆహారం కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత నన్ను ఆ లోయ ప్రాంతంలో ఉన్న ఒక తిరుగుబాటుదారుల గ్రూపుకు అప్పగించారు. ఆ రాత్రి మొత్తం వాళ్లు నన్ను ఏమేం చేయాలో అన్నీ చేశారు. ఆ రాత్రి నరకం అనుభవించాను. తెల్లవారిన తర్వాత వాష్ రూమ్ కు వెళ్లాలని, నాకు కట్టిన కట్లను విప్పాలని వాళ్లని అడిగాను. వాళ్లలో ఉన్న ఒక మంచి వ్యక్తి నా కట్లను విప్పాడు. 

ఆ తర్వాత ఒకసారి చుట్టూ చూశాను. ధైర్యం తెచ్చుకుని, కొండ మీద నుంచి తప్పించుకోవాలనే నిర్ణయానికి వచ్చా. కొండ మీద నుంచి కిందకు పరుగెత్తుకుంటూ వచ్చాను. ఒక ఆటో డ్రైవర్ నాకు సహాయం చేశాడు. ఆటోలోని కాయగూరల కింద నన్ను దాచి, అక్కడి నుంచి తీసుకొచ్చాడు. చివరకు కాంగ్ పోక్పికి చేరుకున్నా” అని ఆమె తెలిపింది.  

ఆ తర్వాత ఆమె పొరుగు రాష్ట్రమైన నాగాలాండ్ రాజధాని కోహిమా ఆసుపత్రిలో చికిత్స పొందింది. జులై 21న ఆమె కాంగ్ పోక్సి పోలీస్ స్టేషన్ లో తనపై జరిగిన అఘాయిత్యంపై ఫిర్యాదు చేసింది. ఆమె స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన పోలీసులు, దర్యాప్తును ప్రారంభించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీని చెక్ చేస్తున్నారు. కిడ్నాప్, అత్యాచారాలకు సంబంధించి ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. నిందితులకు సంబంధించి తమకు ఇంకా ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. మరోవైపు ఆమెకు జరిగిన దారుణంపై అందరూ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

Related posts

కాలినడకన వెళ్లే భక్తులకు చేతికర్ర… భూమన….!

Ram Narayana

ఇనగుర్తి నుంచి ఇంద్రప్రస్థ పంపిన ఘనత కేసీఆర్ దే : ఎంపి వద్దిరాజు రవి

Drukpadam

కాంగ్రెస్ నేత పొంగులేటితో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ

Drukpadam

Leave a Comment