Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

స్పామ్ కాల్స్ కు చెక్ పెట్టేందుకు ట్రూ కాలర్ లో కొత్త ఫీచర్

  • ఏఐ ఆధారిత కాల్ స్క్రీనింగ్ ఫీచర్ ప్రారంభించిన కంపెనీ
  • త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడి
  • ఈ ఫీచర్ కావాలంటే నెలనెలా కొంత సొమ్ము చెల్లించాల్సిందే

నిత్యజీవితంలో సెల్ ఫోన్ ఓ భాగంగా మారిపోయింది.. ప్రస్తుతం ఫోన్ లేకుండా క్షణం గడిచే పరిస్థితి లేదు. ఈ పరిస్థితిని మార్కెటింగ్ సంస్థలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. తమ ఉత్పత్తుల గురించి నేరుగా కస్టమర్లకు వివరించేందుకు కాల్స్ చేస్తున్నాయి. అయితే, ముఖ్యమైన పనిలో బిజీగా ఉన్నపుడు ఇలాంటి కాల్స్ రావడం చాలామందికి విసుగు తెప్పిస్తోంది.

దీనికితోడు మోసపూరితమైన కాల్స్ వల్ల పలువురు డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ట్రూ కాలర్ ఓ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకీ తీసుకొస్తోంది. స్పామ్ కాల్స్ ను అడ్డుకునేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయం తీసుకుంటోంది. అయితే, ఈ ఫీచర్ కోసం నెలనెలా కొంత సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని ట్రూ కాలర్ స్పష్టం చేసింది.

ట్రూ కాలర్ ప్రీమియం సబ్ స్క్రైబర్లకు ఈ ఏఐ ఫీచర్ ను త్వరలో అందుబాటులోకి తెస్తామని కంపెనీ వివరించింది. ఏఐ ఆధారిత కాల్ స్క్రీనింగ్ ఫీచర్ లో స్పామ్ కాల్స్ ను అడ్డుకోవడంతో పాటు కాలర్ ఉద్దేశాన్ని కూడా ముందే తెలుసుకునే సదుపాయం ఉందని తెలిపింది. దీంతో ఆ కాల్ మాట్లాడాలా లేదా అనేది నిర్ణయించుకోవచ్చని పేర్కొంది. దీనివల్ల బిజీగా ఉన్నపుడు సమయం వృథా కాకుండా చూసుకోవచ్చని తెలిపింది.

యూజర్ భద్రత, వ్యక్తిగత వివరాల గోప్యతను ఈ ఫీచర్ కాపాడుతుందని వివరించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ ను ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉంచినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. మొదటి 14 రోజులు ఈ ఫీచర్ ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చని చెప్పారు. రెగ్యులర్ గా వినియోగించడం కోసం ట్రూ కాలర్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలని, ఇందుకోసం మొదటి నెల రూ.99 ఆపై నెల నెలా రూ.149 లు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.

Related posts

మరి వీరిని ఎలాంటి దొంగలు అనాలి ….

Drukpadam

వరద నీటిలో కొట్టుకుపోయిన జగిత్యాల ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ !

Drukpadam

పది రోజుల్లో 12 మంది తలలు ఖండించిన సౌదీ అరేబియా!

Drukpadam

Leave a Comment