వనమా వర్సెస్ జలగం …కొత్తగూడెం ఎమ్మెల్యేపై డైలమా …?
కోర్ట్ తీర్పు జలగం కు అనుకూలం ..దానిపై స్టే ఇవ్వాలని కోర్ట్ కు వెళ్లిన వనమా !
లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు …వాదనలు విన్న కోర్ట్ తీర్పు రిజర్వ్
సుప్రీం కోర్ట్ లో ఎస్ ఎల్ పి వేసేందుకు వనమా సమాయత్తం
స్పీకర్ విషయం వివరించిన జలగం ఆయన సూచన మేరకు అసెంబ్లీ సెక్రటరీ కి కోర్ట్ తీర్పు కాపీ అందజేత ..
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కలిసిన జలగం కోర్టు తీర్పు కాపీ ఇచ్చిన వైనం
బీఆర్ యస్ మద్దతు మాకంటే మాకే అంటున్న జలగం …వనమా
కొత్తగూడెం అసెంబ్లీనుంచి 2018 ఎన్నికల్లో గెలిచిన వనమా ఎన్నిక చెల్లదని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు పై డైలమా నెలకొన్నది …ఇటు ప్రభుత్వం రాష్ట్ర శాసనసభ కార్యాలయం ..రాష్ట్ర ఎన్నికల కమిషనర్ న్యాయసలహా తీసుకుంటున్నారు . ఎన్నిలకు రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు అమలుపై మల్లగుల్లాలు పడుతున్నారు . ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన వనమా వెంకటేశ్వరావు 4 వేల 139 ఓట్ల మెజార్టీ తో టీఆర్ యస్ అభ్యర్థిగా పోటీచేసిన జలగం వెంకట్రావుపై గెలుపొందారు …లెక్క ప్రకారం మెజార్టీ వచ్చిన అభ్యర్థిని ఎన్నికల సంఘం గుర్తించి డిక్లైర్ చేసింది…. నాటినుంచి వనమా శాసనసభ్యుడిగా కొనసాగుతున్నారు .అయితే ఎన్నికల సంఘానికి వనమా ఇచ్చిన అఫిడవిట్ లో తప్పుడు వివరాలు ఇచ్చారని జలగం కోర్టుకు వెళ్లారు .దానిపై విచారణ జరిపిన కోర్ట్ జలగం ఇచ్చిన మెటీరియల్ ఎవిడెన్స్ ఆధారంగా వనమా తప్పుడు సమాచారం ఇచ్చారని నిర్దారింఛి ఆయన ఎన్నిక చెల్లదని ఆయనపై అనర్హత వేటు వేసింది . దీంతో రెండవ స్థానంలో ఉన్న జలగం వెంకట్రావు ను ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లు ప్రకటించాలని, కోర్ట్ తన తీర్పులో తెలిపింది . మొత్తం 84 పేజీల జడ్జి మెంట్ కాపీని తీసుకోని జలగం శాసనసభ స్పీకర్ ను అప్రోచ్ అయ్యారు ఆయన సూచనమేరకు అసెంబ్లీ కార్యదర్శిని కలిశారు . ఆ తర్వాత ఎన్నికల కమిషనర్ ను కలిశారు .తీర్పు కాపీ అందజేశారు . తనను శాసనసభ్యుడిగా కోర్ట్ ఉత్తర్వులు ప్రకారం ప్రమాణ స్వీకారం చేయించాలని కోరారు .అందుకు వారు కోర్ట్ తీర్పును పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు …
కోర్ట్ తీర్పుపై వనమా వెంకటేశ్వరావు బుధవారం హైకోర్టు లో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు . తాను సుప్రీం కోర్టుకు వెళుతున్నందున అప్పటివరకు తన ఎమ్మెల్యే పదవి అనర్హతపై స్టే ఇవ్వాలని కోరారు . కోర్ట్ వనమా వాదనలు విన్నది .జడ్జి మెంట్ రిజర్వ్ చేసింది. దీనిపై జలగం మాట్లాడుతూ వనమా కోర్టుకు వెళ్లడం ఆయన కు ఉన్న హక్కు అని అందువల్ల దాన్ని గురించి మాట్లాడేది ఏమిలేదని అన్నారు. తన న్యాయపోరాటం ఇప్పటిది కాదని చాల రోజుల తర్వాత న్యాయమే గెలిచిందని అన్నారు .కొద్దీ కాలమైనా తనకు నియోజకవర్గ సమస్యలపై ఎజెండా ఉందని దానిప్రకారం వెళతానని అన్నారు . గెజిట్ లో అప్పటి ఎమ్మెల్యే బదులు తన పేరు రావాల్సి ఉందని ..అయితే దానికి తన ప్రమాణ స్వీకారానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు .
ఇద్దరు నేతలు బీఆర్ యస్ తమకు అండగా ఉందని చెప్పడం కొసమెరుపు …కాంగ్రెస్ నుంచి గెలిచిన వనమా బీఆర్ యస్ లోచేరి ఆపార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా …టీఆర్ యస్ నుంచి పోటీచేసి ఓడిపోయినా జలగం వెంకట్రావు న్యాయపోరాటంలో గెలిచి వచ్చారు . తాను బీఆర్ యస్ లోనే ఉన్నానని ఎంపీగా నామ నాగేశ్వరావు పోటీచేసినప్పుడు కేసీఆర్ ఆదేశాలమేరకు ఊరూరూ తిరిగి ప్రచారం చేసి గెలిపించానని , ఖమ్మం లో జరిగిన బీఆర్ యస్ సభకు కేసీఆర్ పిలిస్తే హాజరైయ్యానని , ఎప్పడు కేసీఆర్ మాట జవదాటలేదని అంటున్నారు . బీఆర్ యస్ పార్టీ వైఖరి ఎలా ఉంది… ఇద్దరిలో ఎవరిని సపోర్ట్ చేస్తుందనేది తేలాల్సి ఉంది….
