Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

బియ్యం…బియ్యం భారత్ బియ్యానికి విదేశాల్లో యమ క్రేజీ …

lబియ్యం ఎగుమతులపై భారత్ ఆంక్షల ఫలితం.. అమెరికాలో వ్యాపారుల కీలక నిర్ణయం

  • బియ్యం కోసం దుకాణాల ముందు క్యూలు కడుతున్న భారతీయులు
  • ఒక కుటుంబానికి ఒకే బస్తా ఇవ్వాలని వ్యాపారుల నిర్ణయం
  • అయినా కరిగిపోతున్న నిల్వలు
  • ఆసియా దేశస్థుల్లో ఆందోళన

బియ్యం ఎగుమతులపై భారత ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో అమెరికాలో బియ్యం కోసం భారతీయులు సహా ఆసియా దేశాలకు చెందినవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క బస్తా అయినా దొరికితే అదే పదివేలని భావిస్తున్నారు. భారత ప్రభుత్వం ఆంక్షలు విధించిన వెంటనే అక్కడి జనాలు సూపర్ మార్కెట్లలో బియ్యం కోసం ఎగబడ్డారు. దొరికినన్ని చేజిక్కించుకునేందుకు నిల్వ చేసుకునేందుకు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

దుకాణాల ముందు కిలోమీటర్ల పొడవున క్యూలు కనిపించాయి. ఈ నేపథ్యంలో అక్కడి వ్యాపారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అందరికీ బియ్యం దక్కేలా ఒక కుటుంబానికి ఒక్కటే బస్తా విధానాన్ని అమలు చేస్తున్నారు. అయినప్పటికీ నిల్వలు నిండుకుంటుండడంతో అక్కడి ఆసియా దేశస్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

బియ్యం ఎగుమతుల్లో ప్రపంచంలో నెం.1 భారత్…

  • 2022లో 22.5 మిలియన్ టన్నుల ఎగుమతి
  • తరువాతి స్థానాల్లో వరుసగా థాయ్‌ల్యాండ్, వియత్నాం, పాకిస్థాన్, అమెరికా
  • భారత్ నుంచి భాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని అధికంగా దిగుమతి చేస్తున్న ఆఫ్రికా దేశాలు
  • మధ్యప్రాచ్యం, మధ్యఆసియా దేశాలకు భారత్ బాస్మతీ బియ్యం ఎగుమతి
  • దేశీధరలకు కళ్లెం వేసేందుకు భారత్ నాన్ బాస్మతీ బియ్యం ఎగుమతులపై నిషేధం
  • భారత్ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన, ఆహార ద్రవ్యోల్బణం పెరగొచ్చన్న అంచనా
Here are the world biggest exporters of rice including india

నాన్ బాస్మతీ బియ్యం ఎగుమతులను నిషేధిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా కలకలానికి దారి తీసింది. అంతర్జాతీయంగా ఆహార ధరలు పెరుగుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నిషేధం గురించి తెలిసిన వెంటనే విదేశాల్లో అనేక మంది బియ్యం బస్తాలను భారీ స్థాయిలో కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ కలకలం రేపుతున్నాయి. 

బియ్యం కోసం విదేశాల్లో క్యూ కడుతున్న జనం

ఒక స్టోర్ లో బియ్యం కోసం ఎగబడుతున్న భారతీయులు …

Related posts

కెనడాతో సంబంధాలు కలిగిన టెర్రరిస్ట్ లు, గ్యాంగ్ స్టర్లు.. జాబితా విడుదల

Ram Narayana

యువ బిలియనీర్లుగా భారతీయ సోదరులు.. వారి నెట్ వ‌ర్త్ ఎంతో తెలిస్తే..!

Ram Narayana

వయ్యారిభామల కోసం వెంపర్లాడితే బలైపోతారు జాగ్రత్త… పౌరులకు చైనా ప్రభుత్వం హెచ్చరికలు

Ram Narayana

Leave a Comment