చేకూరి కాశయ్య మృతికి.. వెంకయ్యనాయుడు , కేసీఆర్,నామ తుమ్మల , సంతాపం
తుదిశ్వాస విడిచిన స్వాతంత్ర్య సమరయోధుడు కాశయ్య
ఎమ్మెల్యేగా, ఖమ్మం జిల్లాపరిషత్ ఛైర్మన్ గా పని చేసిన కాశయ్య
ఒక నిస్వార్థమైన రాజకీయ నేత అని కొనియాడిన కేసీఆర్
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం
భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చేకూరి కాశయ్య మరణంపట్ల తీవ్రసంతాపం ప్రకింటిచారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆయనతో కలిసి పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. గాంధేయవాది చేకూరి కాశయ్య జీవితాంతం ఖద్దరు ధరించి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు .ఎమ్మెల్యేగా ,జిల్లాపరిషత్ చైర్మన్ గా ఆయన అందించిన సేవలు మారలేని అన్నారు. తనపట్ల ఎంతోప్రేమ కనబరిచేవారని అన్నారు.ఆయన చిత్తశుద్ధి , అంకితభావం, క్రమశిక్షణ , దేశభక్తి , నిజాయతి ఈతరం యువతకు ఆదర్శనీయమన్నారు.
చేకూరి కాశయ్య మృతికి. కేసీఆర్ సంతాపం
మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ చేకూరి కాశయ్య తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, తెలంగాణ అభ్యుదయవాదిగా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఆయన తనదైన ముద్ర వేశారని సీఎం కొనియాడారు. ఒక నిస్వార్థమైన రాజకీయ నేత అని అన్నారు. చేకూరి కాశయ్య మరణంతో నిజాయతీ కలిగిన ఒక సీనియర్ రాజనీతిజ్ఞుడిని తెలంగాణ కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
నామ నాగేశ్వరరావు సంతాపం
ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు , లోకసభలో టీఆర్ యస్ పక్ష నేత నామ నాగేశ్వరరావు చేకూరి కాశయ్య మరణం తనను కలిచి వేసిందన్నారు. జిల్లా ప్రజల హృదయాల్లో ఆయన కలకాలం నిలిచి ఉంటారని కొనియాడారు. ఆయన పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.వారి కుటుంబ సభ్యులను ఓదార్చి సానుభూతి ప్రకటించారు.
మాజీమంత్రి తుమ్మల సంతాపం
రాజకీయ దురంధరుడు ,గురువుల భవించే చేకూరి కాశయ్య మరణం ఖమ్మం జిల్లా అభివృద్ధికి తీరనిలోటని మాజీమంత్రి టీఆర్ యస్ రాష్ట్ర నాయకులూ తుమ్మల నాగేశ్వరరావు సంతాపం ప్రకటించారు. ఖమ్మంలో ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి తుమ్మల నివాళులు అర్పించారు. ఆయనతో గల ఆంభందాన్ని గుర్తుచేసుకున్నారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.