Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

మున్నేరుకు కరకట్ట కాంగ్రెస్ తో నే సాధ్యం …కాంగ్రెస్ రాష్ట్ర నేత పొంగులేటి .

మున్నేరుకు కరకట్ట కాంగ్రెస్ తో నే సాధ్యం …కాంగ్రెస్ రాష్ట్ర నేత పొంగులేటి ..

  • అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే నిర్మాణం ప్రారంభిస్తాం
  • వచ్చే ఏడాది నుంచి ఈ బాధలు ఉండవు
  • తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి
  • మున్నేరు ముంపు ప్రాంతాల్లో పర్యటన
  • బాధిత కుటుంబాలకు భరోసా మున్నేరుకు కరకట్ట నిర్మాణం అనేది కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం, పాలేరు నియోజకవర్గ పరిధిలోని ముంపుకు గురైన పెద్దతండా, ఆర్టీసీ కాలనీ, కేబీఆర్ నగర్, బొక్కల గడ్డ, కరుణ గిరి, రాజీవ్ స్వగృహా తదితర ప్రాంతాలను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా బాధలో ఉన్న ప్రతి ఒక్కరిని దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా పలకరించారు. వారి కన్నీటి బాధలను చూసి చలించిపోయారు. వరద ఉధృతికి కొట్టుకొని పోయి మృతిచెందిన సతీష్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. రూ. 25వేలను సాయంగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ బాధలను మరో మూడు నెలలు వరకు మాత్రమే ఉంటాయని, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే కరకట్ట నిర్మాణం కాంక్రీటుతో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది వర్షాకాలం లోపు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని సూచించారు. ముంపుకు గురైన కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందిస్తామని తెలిపారు.

ఈ పర్యటనలో పొంగులేటి వెంట పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయబాబు, రాంరెడ్డి చరణ్ రెడ్డి, రూరల్ మండల అధ్యక్షుడు కల్లెం వెంకట్ రెడ్డి, నగర ఓబీసీ సెల్ ఛైర్మన్ బాణాల లక్ష్మణ్, కార్పొరేటర్లు దుద్దుకూరి వెంకటేశ్వర్లు, మిక్కిలినేని నరేంద్ర, దొడ్డా నగేష్, మలీదు జగన్, ఎం.డీ. ముస్తాఫా, నాగండ్ల దీపక్ చౌదరి, కొప్పెర ఉపేందర్, పాలకుర్తి నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.

Related posts

ప్రొద్దుటూరులో ఆత్మహత్య చేసుకున్న ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ యస్ నేతలు …

Ram Narayana

బీ.అర్.ఎస్ పార్టీకి షాక్… డిప్యూటీ మేయర్ ఫాతిమా దంపతులు బీఆర్ యస్ కు బై… కాంగ్రెస్ కు జై ..

Ram Narayana

పట్టభద్రుల ఎమ్మెల్సీగా రాకేష్ రెడ్డిని గెలిపించాలని వద్దిరాజు విస్త్రత ప్రచారం …

Ram Narayana

Leave a Comment