Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

ప్రజలనే కాదు …భద్రాద్రి రాముణ్ణి సైతం మోసం చేసిన సీఎం కేసీఆర్ …సీఎల్పీ నేత భట్టి ఫైర్

ప్రజలనే కాదు …భద్రాద్రి రాముణ్ణి సైతం మోసం చేసిన సీఎం కేసీఆర్ …సీఎల్పీ నేత భట్టి ఫైర్
కేసీఆర్ ఇది మీకు తగునా అంటూ నిలదీత…!
వరదలను అరికట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందిందని ధ్వజం
9 సంవత్సరాల క్రితం 100 కోట్లు .గత సంవత్సరం వేయి కోట్లు ప్రకటించి ఇవ్వకుండా మోసం చేసిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలిచిపోయారన్న భట్టి …
కరకట్ట అన్నారు …కాలనీ లు అన్నారు …మళ్ళీ వరదలు వచ్చినా, వాటి ఊసే లేదు ..

ప్రజలనే కాదు …భద్రాద్రి రాముణ్ణి సైతం సీఎం కేసీఆర్ మోసం చేశారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడి మొదటిసారి రాముడి కల్యాణానికి భద్రాచలం వచ్చి ఆలయ అభివృద్ధి కోసం 100 కోట్లు ఇస్తానని వాగ్దానం చేశారు . ఇప్పటికి 9 సంవత్సరాలు అయింది. గత ఏడాది గోదావరికి వచ్చిన వరదలతో భద్రాచలం నీటమునిగింది. అనేక కాలనీ లు జలమయమైయ్యాయి. వీటిని స్వయంగా చూసేందుకు భద్రాచలం విజిట్ చేశారు . ఆ సందర్భంగా మీరు 1000 కోట్లు ఇస్తామని వాగ్దానం చేశారు . కానీ ఇంతవరకు ఒక్క పైసా ఇవ్వలేదు … మా పార్టీకి చెందిన స్థానిక శాసనసభ్యుడు పొదెం వీరయ్య అనేక సార్లు శాసనసభలో మీ వాగ్దానాలను గుర్తు చేశారు .ఆయన మీరు స్పందించడకపోవడం దారుణం …. సీఎం గారు ఇది మీకు తగునా అంటూ భట్టి , కేసీఆర్ ను నిలదీశారు . ప్రతిసంవత్సరం వరదలు వస్తున్నా, తగిన జాగ్రత్తలు ముందుగానే తీసుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా వైఫ్యలం చెందినదని ధ్వజమెత్తారు . ఇక్కడ 90 శాతం గిరిజనులు నివసిస్తున్నారు . అమాయక గిరిజనులను మోసం చేయడంమీకు తగదని హితవు పలికారు … ఇప్పటికైనా మీ వాగ్దనాలను అమలు చేసి నిజాయతీని నిరూపించుకోవాలని అన్నారు .

అంతకు ముందు భట్టి భద్రాచలం వద్ద కరకట్ట పరిసరాలను స్థానిక శాసనసభ్యులు పొదెం వీరయ్య తో కలిసి పరిశీలించారు .కరకట్ట రామాలయం వద్ద స్లూవిస్ ను నిశితంగా పరిశీలించారు . స్లూవీస్ మోటార్ల పనితీరును అక్కడ ఉన్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు .ఈసందర్భంగా స్థానికులు మాట్లాడుతూ పాత మోటార్లు,అద్దె మోటార్ల తో కాలం వెళ్లదీస్తున్నారని తమ అసంతృప్తిని వెలిబుచ్చారు . సమయానికి మోటార్లు పనిచేయకపోవడం వలన భద్రాచలం లో ప్రతి ఏడాది వచ్చే గోదావరి వరదలకు ఆలయం చుట్టూ నీరు చేరి దుకాణాలు మునక కు గురైతున్న విషయాన్నీ స్థానికులు చెప్పారు . గోదావరిపై బ్రిడ్జి పై వరదను పరిశీలించారు . భట్టి అక్కడకు వెళ్లిన సందర్భంగా మూడవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ . 55 .01 అడుగుల మేర నీరు ప్రవహిస్తుంది. దిగువకు 15 లక్షల 40 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు …గత సంవత్సరం పాఠాలు తీసుకోని కరకట్ట నిర్మించి ప్రజలను కాపాడాలని వరదలు వచ్చినప్పుడే ఉరుకులు పరుగులు పెడితే సరిపోదని చురకలు అంటించారు . ప్రభుత్వం ఏది ఉన్న అధికార యంత్రాంగం కంటిన్యూ ప్రాసెస్ అని అధికారులు గుర్తు పెట్టుకోవాలి అన్నారు . భద్రాచం వస్తున్నా దారిలో ఉన్న కిన్నెరసాని నది దగ్గర ఆగి వరద నీటిని పరిశీలించారు .

వరి నాట్లు వేసి మహిళల సమస్యలు తెలుసుకున్న భట్టి…

మహిళల తో కలిసి వరి నాట్లు వేసిన సిఎల్పీ నేత భట్టి విక్రమార్క
భట్టి విక్రమార్క కు సమస్యలు ఏకరువు పెట్టుకున్న మహిళలు
డిగ్రీ పట్టాలు చేత పట్టుకొని కూలీ పనులుకు వెళ్తున్న పట్టభద్రులు

గోదావరి వరదలతో అతలాకుతలమైన భద్రాచలం డివిజన్ పరిధిలో మునక ప్రాంతాలను పరిశీలించడానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క మల్లు స్థానిక ఎమ్మెల్యే పోదేం వీరయ్య తో కలిసి భద్రాచలం నుండి దుమ్ముగూడెం వెళ్ళే మార్గం మధ్యలో పాత నారాయణ పేట వద్ద వరి నాట్లు వేస్తున్న మహిళల తో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని వారితో కలిసి వరి నాట్లు వేశారు. ఈ సందర్భంగా మహిళలు భట్టి విక్రమార్కకు వారి సమస్యలు ఏకరువు పెట్టారు వీరభద్రమ్మ అనే మహిళ నేను బీఎస్సీ నర్సింగ్ చేసి ఉద్యోగ అవకాశాలు లేక కూలీ పనులకు వస్తున్నా అని చెప్పగా మరో మహిళ కురం నాగమణి తాను కూడా బి. కాం కంప్యూటర్స్ చేసి కూలీ పనులతో జీవనం వెళ్లదీస్తున్నాము అని భట్టి విక్రమార్క తో తమ ఇబ్బందులు చెప్పారు అలాగే మరి కొందరు ఐటీడీఏ నుండి మాకు బోర్లు వేసుకోడానికి ఎటువంటి నిధులు అందడం లేదు అని కొందరు భట్టి విక్రమార్క విన్నవించారు…వారి సమస్యలు సవదానంగా విన్న సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మరో నాలుగు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది మీ అందరి సమస్యలు పరిష్కారం అవుతాయి అని వారికి భరోసా నిచ్చారు….

భట్టి విక్రమార్కకు స్వాగతం పలికిన పోట్ల నాగేశ్వరరావు

భద్రాచలం ముంపు గ్రామాలను పర్యటనకు వెళ్తున్న సీఎల్పీ నాయకులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో సీఎల్పీ నాయకులు మధిర శాసనసభ్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క కు మాజీ ఎమ్మెల్సీ టిపిసిసి ఉపాధ్యక్షులు పోట్ల నాగేశ్వరరావు స్వాగతం పలికారు వారితోపాటు టిపిసి సభ్యులు రాష్ట్ర సెల్ కన్వీనర్ జేబీ శౌరీ, సీనియర్ న్యాయవాది వెల్లంకి వెంకటేశ్వరరావు,జిల్లా నాయకులు అల్లాడి నరసింహారావు, మహమ్మద్ గౌస్, ఉస్మాన్, రంజిత్ నాయుడు, ఏలూరి రాందాస్ తదితరులు ఉన్నారు . అక్కడ నుంచి పోట్ల భట్టి వెంట భద్రాచలం పర్యటనకు వెళ్లారు ….

Related posts

ఈనెల 22 న ఢిల్లీలో పొంగులేటి ,జూపల్లి రాహుల్ గాంధీతో భేటీ !

Drukpadam

బీఆర్ యస్ పతనం ఖమ్మం నుంచే ప్రారంభం …రేవంత్ రెడ్డి…

Drukpadam

తెలంగాణ మహాలక్ష్ములకు అభినందనలు: రేవంత్ రెడ్డి ట్వీట్

Ram Narayana

Leave a Comment