Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

వైభవంగా వురిమళ్ల ఫౌండేషన్ పురస్కారాల ప్రదానోత్సవం

వురిమళ్ల ఫౌండేషన్ పురస్కారాల ప్రదానోత్సవం ఆదివారం ఖమ్మం మంచికంటి మీటింగ్ హాల్‌లో వైభవంగా జరిగింది. ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు వురిమళ్ల సునంద అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రతిష్టాత్మకమైన భోగోజు సముద్రమ్మ-పురుషోత్తం స్మారక సాహిత్య పురస్కారాన్ని ఖమ్మానికి చెందిన ప్రముఖ నాటక రచయిత, నంది అవార్డు గ్రహీత తాటికొండాల నర్సింహారావుకు ప్రదానం చేశారు. పురస్కారంతో పాటు పది వేల నగదు బహుమతిని అందచేశారు. అనంతరం అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన వురిమళ్ల శ్రీరాములు స్మారక కథల, పద్మజ స్మారక కవితల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి నగదు పురస్కారాలు అందచేశారు. కథల పోటీల్లో ప్రథమ బహుమతిని శింగరాజు శ్రీనివాసరావు(ఒంగోలు), ద్వితీయ బహుమతిని మరీదు వేణు(ఖమ్మం), తృతీయ బహుమతిని ఎనుగంటి వేణుగోపాల్(జగిత్యాల), కన్సోలేషన్ బహుమతులను శైలజామిత్ర(హైదరాబాద్), సింహప్రసాద్(హైదరాబాద్), ఎల్.విజయదుర్గ(నెల్లూరు)ఆర్‌సి కృష్ణస్వామి రాజు (తిరుపతి) గెలుచుకున్నారు. వీరిలో మరీదు వేణు, ఎనుగంటి వేణుగోపాల్, ఆర్‌సి కృష్ణస్వామి రాజు సభకు హాజరై బహుమతిని అందుకున్నారు. కవితల పోటీల్లో ప్రథమ బహుమతిని కటుకోజ్వల రమేష్(ఖమ్మం), ద్వితీయ బహుమతిని సిహెచ్ వరహ కృష్ణ(కాకినాడ), తాళ్లపల్లి యాకమ్మ(మహబూబాబాద్), ప్రొత్సాహక బహుమతులను అనుసూరి వెంకటేశ్వరరావు(హైదరాబాద్), చొక్కర తాతారావు(వైజాగ్), పి.గాయత్రి(ప్రకాశం) గెలుచుకున్నారు. వీరు సభకు హాజరై బహుమతులను అందుకున్నారు.

అనంతరం జరిగిన సభలో ప్రముఖ సాహితీవేత్త మువ్వా శ్రీనివాసరావు మాట్లాడుతూ వురిమళ్ల ఫౌండేషన్ చేస్తున్న సాహిత్య సేవలను కొనియాడారు. తినే తిండిపైనా ఆంక్షలు పెట్టే సమాజం నేడు కనిపిస్తోందని, అలాంటి వాటిని జనంలోకి తీసుకెళ్లి చైతన్యం చేయాల్సిన బాధ్యత కవులపైనే ఉందన్నారు. అలాంటి కవులను ప్రోత్సహిస్తున్న సునందను అభినందించారు. అనంతరం కథల, కవితల పుస్తకాన్ని ప్రముఖ కవి, వాగ్గేయకారుడు కన్నెగంటి వెంకటయ్య సమీక్షించారు. కథల, కవితల సారాంశాన్ని విశదీకరిస్తూ వాటి ఔన్నత్యాన్ని సభికులకు వివరించారు. ఇంకా ఈ సభలో మహిళా భారతి అధ్యక్షురాలు, ప్రముఖ రచయిత్రి దాసోజు పద్మావతి మాట్లాడుతూ మన మూలాలను మరిచిపోవద్దని, తెలుగు భాష గొప్పతానన్ని పదిమందికి చాటి చెప్పాలన్నారు. ప్రముఖ కవి డాక్టర్ పోతగాని సత్యనారాయణ, ప్రముఖ విమర్శకులు వంశీకృష్ణ మాట్లాడారు. అక్షరాల తోవ సాహిత్య సంస్థ నిర్వాహకులు నామా పురుషోత్తం, దాసరోజు శ్రీనివాస్, రాచమళ్ల ఉపేందర్ సభా సమన్వయం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు హెచ్‌విఎల్ ప్రసాద్‌బాబు, సయ్యద్ షఫీ, ఇబ్రహీం నిర్గుణ్, లెనిన్ శ్రీనివాస్, పగడిపల్లి వెంకటేశ్వర్లు, ప్రముఖ రచయిత్రులు తాళ్లూరి లక్ష్మీ, తాళ్లూరి రాధ, ఫణిమాధవి, తోట సుభాషిణి, ప్రముఖ కమెడియన్ మొగిలి, ప్రముఖ గాయకులు శ్రీనివాసరెడ్డి, పాగి వెంకన్న, మోదుగు గోవింద్ పాల్గొన్నారు.

Related posts

ఖమ్మం జిల్లా ప్రొద్దుటూరులో భూకబ్జా …రైతు ఆత్మహత్య…

Ram Narayana

సత్తుపల్లి ,వైరా ,మధిర నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు భట్టి ,తుమ్మల,పొంగులేటి ప్రచారం

Ram Narayana

అధిష్టానం వద్ద ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ పంచాయతీ…

Ram Narayana

Leave a Comment