Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

టీయూడబ్ల్యూజే (ఐజేయూ ) ఆధ్వరంలో జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ..హెల్త్ కార్డుల కోసం

సీఎం కేసీఆర్ కు పోస్ట్ కార్డుల ఉద్యమం

టీయూడబ్ల్యూజే (ఐజేయూ ) ఆధ్వరంలో జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ..హెల్త్ కార్డుల కోసం
సీఎం కేసీఆర్ కు పోస్ట్ కార్డు ల ఉద్యమం
రాష్ట్రంలో 33 జిల్లాల నుంచి అనూహ్యస్పందన
ఇప్పటికే 6 వేలకు పైగా పోస్ట్ కార్డులు జర్నలిస్టులు ప్రగతి భవనం కు పోస్ట్ చేసినట్లు సమాచారం…
మరికొన్ని జిల్లాలనుంచి ప్రారంభం కానున్న పోస్ట్ కార్డుల ఉద్యమం
10 వేల పోస్ట్ కార్డుల ప్రగతి భవనం కు చేరాలా కార్యాచరణ

రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిస్కారం కోసం నిత్యం పోరాడుతున్న ఏకైన మొనగాడుగా ఉన్న టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వరంలో సీఎం కేసీఆర్ అనేక సందర్భాల్లో ప్రకటించిన ఇళ్ళు , ఇళ్ల స్థలాలు ,హెల్త్ కార్డుల కోసం పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించింది. జులై 20 తేదీన హైద్రాబాద్ బషీర్ బాగ్ లోని దేశోద్ధారక భవనంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు సీఎం కేసీఆర్ కు పోస్ట్ కార్డులు చేరాలా ప్రగతి భవనం అడ్రస్ కు 10 వేల పోస్ట్ కార్డు లు పంపాలని కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ అధ్యక్షతన జరిగిన ఈసమావేశంలో ఐజేయూ అధ్యక్షులు కె .శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపై రాష్ట్ర కార్యవర్గ సమావేశం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అన్ని జిల్లా యూనిట్లు జయప్రదం చేయాలనీ పిలుపు నిచ్చారు . రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలవల్ల, కార్యక్రమం కొంచం ఆలస్యమైనా జిల్లాల నుంచి అందిన సమాచారం మేరకు ఇప్పటికే 6 వేలకు పైగా కార్డులు సీఎం కేసీఆర్ పేరుతో ప్రగతి భవనం కు పోస్టు చేసినట్లు సమాచారం …మొత్తం 33 జిల్లాలో సగం జిల్లాల నుంచే ఈ రిపోర్ట్ వచ్చిందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ తెలిపారు . ఇంకా కొన్ని ప్రధానమైన జిల్లాల నుంచి సమాచారం అందాల్సి ఉందని అన్నారు . అందుతున్న సమాచారం ప్రకారం 10 వేలకు మించి పోస్ట్ కార్డులు సీఎం కేసీఆర్ కు చేరతాయని అన్నారు .

తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన సందర్భంగా 2014 ఎన్నికలకు ముందు కేసీఆర్ స్వయంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు , అక్క్రిడేషన్ కార్డులు , హెల్త్ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు …హామీతో సరిపెట్టుకోకుండా ఎన్నికల ప్రణాళికలో సైతం పెట్టారు .మన రాష్ట్రం మనపాలన అనుకోని అందరిలాగానే జర్నలిస్టుల బ్రతుకులు బాగుపడతాయని జర్నలిస్టులు భావించారు . ఉద్యమసమయంలో కూడా దానికి అండగా ఉద్యమ వార్తలను వెలుగులోకి తెచ్చేందుకు జర్నలిస్టులు లాఠీ దెబ్బలు తిన్నారు . పోలిసుల కేసులు , వీడియో ,కెమెరాలు ధ్వంసం అయ్యాయి …ఇది కేసీఆర్ కు తేలింది కాదు …తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు .జిల్లాలో పర్యటనల సందర్భంగా సీఎం కేసీఆర్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చారు . హైద్రాబాద్ , ఖమ్మం , వరంగల్ , కరీంనగర్ , నిజామాబాద్ లాంటి నగరాల్లో జర్నలిస్టులకు అందమైన కాలనీ లు నిర్మించి ఇస్తామని అన్నారు…. కానీ అదికూడా సీఎం స్థాయిలో ఇచ్చిన హామీ …అదికూడా ఆయన ఆషామాషీగా ఇచ్చిన హామికాదు … కానీ ఆ తరవాత దాని గురించి పట్టించుకోలేదు …ఇదేమని అడిగితె సుప్రీం కోర్ట్ లో కేసు ఉందని అందువల్ల ఇళ్ల స్థలాల విషయంలో కోర్ట్ తీర్పు రావాల్సిందే అని అన్నారు . చివరకు కేసీఆర్ చొరవతో సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ జర్నలిస్టులకు ఇళ్లస్థలాల విషయంలో రాష్ట్రంప్రభుత్వం ముందుకు పోవచ్చునని డైరక్షన్ ఇచ్చారు . ఇది జర్నలిస్ట్ లోకం హర్షించింది…. సుప్రీం తీర్పును స్వాగతించింది. .. తమకు సుప్రీం తీర్పు ప్రకారం హైద్రాబాద్ లో జవహర్ లాల్ నెహ్రు హౌస్ బిల్డింగ్ కో- ఆపరేటివ్ సొసైటీకి స్థలం అప్పగించాలని చేస్తున్న ఉద్యమానికి టీయూడబ్ల్యూ జె పూర్తీ మద్దతు ప్రకటించింది…

సుప్రీం తీర్పు అనుకూలంగా ఉన్నప్పటికీ ఇళ్లస్థలాల విషయం ముందుకు సాగడం లేదు …అక్కడో ఇక్కడో ప్రభుత్వం జి ఓ ప్రకారం కాకుండా ఎమ్మెల్యేల దయతలిస్తే కొన్ని జిల్లాలో బీపీఎల్ కింద కొంతమందికి ఇచ్చారు . ఖమ్మంలో సీఎం వాగ్దానం మేరకు జి ఓ వచ్చింది. ఇంకా సొసైటీకి స్థలం హ్యాండ్ ఓవర్ కావాల్సి ఉంది. ఇందుకు జిల్లా మంత్రి కృషి చెప్పొకోదగ్గది …క్యాబినెట్ ఆమోదం ద్వారా ఖమ్మం లో జర్నలిస్టులకు స్థలం కేటాయించనందుకు సీఎం కేసీఆర్ కు , అందుకు సహకరించిన మంత్రి హరీష్ రావు కు జిల్లా మంత్రి అజయ్ కు టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపింది…. మిగతా జిల్లాలో కూడా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సమస్య కేసీఆర్ సహృదయంతో పరిష్కరించాలనే ఉద్దేశంతోనే పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టడం జరిగింది.

మరో ముఖ్యమైన సమస్య జర్నలిస్టులను వేధిస్తుంది. అది హెల్త్ కార్డుల సమస్య ..ప్రభుత్వం జర్నలిస్టులకు ఉద్యోగులతో సమానంగా అన్ని ఆసుపత్రుల్లో కార్డులు చెల్లు బాటు అయ్యేలా జారీచేసినప్పటికీ అమలు కావడంలేదు …కార్డులు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ను జర్నలిస్ట్ సమాజం కోరుతున్నది …సీఎం తలుచుకుంటే జర్నలిస్టుల కు ఇళ్ల స్థలాలు , హెల్త్ కార్డులు సమస్య కాదు … సమాజ శ్రేయస్సు కోసం ఫోర్త్ పిల్లర్ గా పిలవబడుతున్న జర్నలిస్టుల సమస్యల పరిస్కారం కోసం సీఎం కేసీఆర్ ముందడుగు వేసి దేశానికి ఆదర్శ ప్రాయంగా నిలుస్తారని ఆశిద్దాం ….

Related posts

ప్రజలనే కాదు …భద్రాద్రి రాముణ్ణి సైతం మోసం చేసిన సీఎం కేసీఆర్ …సీఎల్పీ నేత భట్టి ఫైర్

Ram Narayana

నల్లగొండ ఎమ్మెల్సీ కౌంటింగ్ లో గందరగోళం …బీఆర్ యస్ నిరసన

Ram Narayana

ఎమ్మెల్యేలకు కేసీఆర్ భరోసా …మీకేం కాదులే నేనున్నానని హామీ…!

Ram Narayana

Leave a Comment