Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
వ్యవసాయం వార్తలు

కాళేశ్వరంతో వ్యవసాయ రంగ ముఖచిత్రం మారిపోయింది: సీఎం కేసీఆర్…

కాళేశ్వరంతో వ్యవసాయ రంగ ముఖచిత్రం మారిపోయింది: సీఎం కేసీఆర్…
నీటిపారుదల రంగంపై సీఎం కేసీఆర్ సమీక్ష
లిఫ్ట్ పథకాలకు టెండర్లు పిలవాలని ఆదేశం
దేవాదుల ప్రాజెక్టు వరంగల్ జిల్లాకు అంకితం చేస్తామని వెల్లడి
కాళేశ్వరంతో రెండు పంటలు పండిస్తున్నామన్న కేసీఆర్
కాళేశ్వరంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ ముఖచిత్రమే మారిపోయిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నీటిపారుదల రంగంపై ప్రగతి భవన్ లో జరిగిన ఉన్నత స్థాయిసమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సంద్రాభంగా రాష్ట్రంలోని నీటిపారుదల రంగాన్ని గురించి అధికారులతో విపులంగా చర్చించారు. కాళేశ్వరం నీతితో 35 లక్షల ఎకరాలకు రెండుపంటలు నీరు అందుతున్నదని పేర్కొన్నారు. అందువల్ల దేవాదుల ప్రాజక్టు కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లా కోసమే వినియోగపడేలా నివేదికలు సిద్ధం చేయాలని అన్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజక్టు లన్నిటిపై సమగ్రమైన రిపోర్ట్ తయారు చేయాలనీ అధికారులునను ఆదేశించారు. నాగార్జున సర్గర్ ఉపఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నెల్లికల్లు లిఫ్ట్ ను చేపట్టాలని అధికారులను కోరారు. దేవరకొండ నుంచి కోదాడ వరకు నిర్మించే లిఫ్ట్ పథకాలకు టెండర్లు పిలవాలని, జూన్ 15 లోపు అంచనాలు పూర్తి చేయాలని ఆదేశించారు. నెల్లికల్ లో 15 లిఫ్ట్ ప్రాజెక్టులకు అంచనాలు రూపొందించాలని నిర్దేశించారు. అన్నింటికీ ఒకేసారి టెండర్లు పిలవాలని స్పష్టం చేశారు. కాగజ్ నగర్, బెల్లంపల్లి లిఫ్ట్ ఆయకట్టుకు సర్వే చేయాలని అన్నారు. దేవాదుల ప్రాజెక్టును వరంగల్ జిల్లాకే అంకితం చేస్తామని చెప్పారు. కాల్వల మరమ్మతుల కోసం రూ.700 కోట్లు కేటాయించామని తెలిపారు. జూన్ 30 నాటికి మొదటి దశ చెక్ డ్యాములు పూర్తిచేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ వ్యవసాయ రంగ ముఖచిత్రమే మారిపోయిందని అన్నారు. కాళేశ్వరంతోనే 35 లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండిస్తున్నామని తెలిపారు. నదీ గర్భంలోనే 100 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే స్థాయికి చేరామని పేర్కొన్నారు. ప్రస్తుతం వివిధ దశలలో ఉన్న మిగతా ప్రాజెక్టులగురించి వివిరాలు అడిగి తెలుసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికపై లిఫ్టులను ప్రాజక్టులను పూర్తి చేసేందుకు సమయాన్ని సైతం నిర్దేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts

రైతు చట్టాలను పాతరేయాల్సిందే :బ్లాక్ డే లో రైతు ఉద్యమనేత తికాయత్…

Drukpadam

2000 టమాటా బాక్సులు అమ్మి రూ.38 లక్షలు సంపాదించిన కర్ణాటక రైతు…

Drukpadam

ఈ మామిడిపళ్ల ఖరీదు కిలో రూ.3 లక్షలు… ప్రపంచంలోనే ఖరీదైన మామిడిని పండిస్తున్న రైతు

Ram Narayana

Leave a Comment