- 18 ఏళ్ల వివాహబంధానికి ముగింపు పలికిన జస్టిన్ ట్రూడో దంపతులు
- సోషల్ మీడియాలో ప్రకటన
- 2005లో వివాహం బంధంలోకి అడుగుపెట్టిన జస్టిన్, సోఫీ
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఆయన భార్య సోఫీ తమ 18 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారు. ఈ విషయాన్ని వారు స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇందుకు సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్‌పై ఇరువురు సంతకాలు కూడా చేసినట్టు ట్రూడో కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ట్రూడో(51), సోఫీ(48) 2005లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు.
జస్టిన్, సోఫీ ప్రస్తుతం తమ పిల్లలను ఓ భద్రమైన ప్రేమపూరిత వాతావరణంలో పెంచడంపైనే దృష్టి పెట్టారని ట్రూడో కార్యాలయం తన ప్రకటనలో పేర్కొంది. వారంతా ఎప్పటికీ ఓ కుటుంబమేనని వెల్లడించింది.
గతంలో కెనడా ప్రధానిగా పనిచేసిన తన తండ్రి కూడా ఇదే విధంగా విడాకులు తీసుకోవడం గమనార్హం ….