Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులా…? ఇందులో ఎన్ని గంటలు చర్చ …?

అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులా…? ఎందులో ఎన్ని గంటలు చర్చ …?
మొక్కుబడి సమావేశాలు అనే విమర్శలు
రాజ్యాంగం ప్రకారం ఆరునెలకొకసారి పెట్టాలి కాబట్టి పెడుతున్నట్లు ఉంది
ఇలా ఐతే ప్రజల సమస్యలు చర్చించేదెట్ల అంటున్న సీఎల్పీ నేత భట్టి
కనీసం 20 సమావేశాలు నిర్వహించాలని డిమాండ్
ఇందుకోసం స్పీకర్ కు లేఖ రాష్ట్రానన్న భట్టి ..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమైయ్యాయి .ఎన్ని రోజులు సమావేశాలు జరుపుతారు …అందులో ఎన్ని గంటలు చర్చిస్తారు …ప్రజల సమస్యల చర్చించే వేదికగా కాకుండా కేవలం బిల్లుల ఆమోదం కోసం …రాజ్యాంగం ప్రకారం ప్రతి ఆరునెలలకొకసారి సమావేశాలు నిర్వహించాలి కాబట్టి నిర్విస్తున్నట్లుగా ఉందని సీఎల్పీ నేత భట్టి అభిప్రాయపడ్డారు …మొక్కుబడిగా సమావేశాలు నిర్వహించడంపై విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి. ఇలా అయితే ప్రజల సమస్యలు చర్చించేదెట్లాఅని సీఎల్పీ నేత అధికార పక్షం చర్యలను తప్పు బడుతున్నారు . కనీసం సమావేశాలు 20 రోజులు పెట్టాలని అంటున్నారు . ఇందుకోసం స్పీకర్ కు లేఖ రాష్ట్రమని పేర్కొన్నారు .

భట్టి ఏమన్నారంటే …..

అసెంబ్లీ పని దినాలపై ఇంకా స్పష్టత రాలేదు.. స్పష్టత కోసం సభాపతికి లేఖ రాస్తానని భట్టి అన్నారు .అతి తక్కువ రోజులు అసెంబ్లీని నడిపించిన చరిత్ర దక్కుతుందని ఎద్దేవా చేశారు …20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని లేఖ రాస్తామన్న భట్టి సభలో పలు అంశాలపై చర్చ జరగాల్సి ఉందన్నారు …

దేశంలోనే అతి తక్కువ రోజులు అసెంబ్లీని నడిపించిన చరిత్ర ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలను 20 రోజుల పాటు నిర్వహించాలని కాంగ్రెస్ అడగగా, ప్రభుత్వం మూడు రోజులకు పరిమితం చేసినట్లుగా వార్తలు వచ్చాయి.

ఈ అంశంపై మల్లు భట్టి మాట్లాడుతూ… అసెంబ్లీ పని దినాలపై పూర్తి స్పష్టత ఇవ్వలేదన్నారు. అయితే ప్రభుత్వం కేవలం మూడు రోజులు మాత్రమే సభ నడపాలని చూస్తోందని విమర్శించారు. సమావేశాలను ఇరవై రోజుల పాటు నిర్వహించాలని కోరుతూ సభాపతికి లేఖ రాస్తామన్నారు. పోడు భూములు, ధరణి, సింగరేణి, బీసీ ప్లాన్‌పై శాసన సభలో చర్చ జరగాల్సి ఉందన్నారు. మైనార్టీ, ఎస్సీ సబ్ ప్లాన్‌పై చర్చకు డిమాండ్ చేయనున్నట్లు చెప్పారు.

ప్రతిపక్షాలకు దైర్యం లేదని అంటున్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే.. 20 రోజులు సభ పెట్టాలని మాట్లాడేందుకు మైకు ఇవ్వాలని ఆ దైర్యం లేకనే కదా …? వారు సమావేశాలను మొక్కుబడిగా జరుపుతుందని అన్నారు .

భూములు, సింగరేణి.. ధరణి..బీసీ సబ్ ప్లాన్ పై చర్చ చేయాలని డిమాండ్ చేశాం …రాజ్యాంగం లో ఆరు నెలలకు సభ పెట్టాలని ఉంది కాబట్టి సభ పెట్టారు… అది కూడా లేకుంటే.. సభ పెట్టె వారే కాదు… శాసనసభ సమావేశాల్లో నిర్వహణ పని గంటలు పెంచడం కాదు.. పని దినాలు పెంచాలి
సీఎం తో మాట్లాడి పని దినాలు 20 రోజులకు పెంచాలని స్పీకర్ ని కోరాము
శాసనసభ సమావేశాల్లో అధికార పార్టీని ఎలా ఎదుర్కోవాలి అనేది కాంగ్రెస్ కి తెలుసు …ఉచిత విద్యుత్ మీద ఎలా చర్చ చేయాలో మాకు తెలుసుని భట్టి అన్నారు .

బీజేపీ అసంతృప్తి ….

ముగ్గురు సభ్యులున్న బీజేపీని బీఏసి సమావేశాలకు ఆహ్వానించకపోవడంపై ఆపార్టీ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్ , రఘునందనరావు లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు .. తమ పార్టీకి ప్రత్యేక రూమ్ కూడా కేటాయించకపోవడం విడ్డురంగా ఉందని అన్నారు . అన్ని రోజులు ఒకేలా ఉంటాయని పొరపాటని బీఆర్ గుర్తుంచుకోవాలని అన్నారు .

మజ్లీస్ …పెదవి విరుపు

సమావేశాలను తక్కువరోజులు జరపాలనే ప్రభుత్వ ఆలోచన పై మజ్లీస్ పార్టీ సైతం పెదవి విరిచింది…ఇది సరికాదని స్పీకర్ ను కోరింది.. సమావేశాలు పొడిగించాలని కోరింది…

Related posts

సంగారెడ్డిలో కూలిన చర్చి.. నలుగురు కూలీలు దుర్మరణం

Ram Narayana

తెలంగాణ ఎన్నికల్లో డాక్టర్ల హవా

Ram Narayana

మేడిగడ్డపై అధికారులకు ముచ్చెమటలు …పట్టించిన మంత్రి పొంగులేటి…!

Ram Narayana

Leave a Comment