Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్రాజకీయ వార్తలు

ఏపీ రాజకీయాల్లో కౌన్సిలర్ కూడా బెదిరించేవాడే!: పవన్ కల్యాణ్

  • జనసేన గల్ఫ్ ప్రతినిధులతో పవన్ సమావేశం
  • రూ.1 కోటి విరాళం అందించిన గల్ఫ్ ప్రతినిధులు
  • ఏపీలో ప్రజలు ప్రశాంతంగా జీవించే పరిస్థితులు లేవన్న పవన్
  • గల్ఫ్ లో బతకగలిగిన మనం ఇక్కడ బతలేకపోతున్నామని ఆవేదన 
  • అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలో తెలియని దుస్థితి నెలకొందని వెల్లడి

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇవాళ మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో గల్ఫ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. జనసేన పార్టీకి గల్ఫ్ ప్రతినిధులు అందించిన కోటి రూపాయల విరాళాన్ని పవన్ స్వీకరించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీలో ప్రజలు ప్రశాంతంగా జీవించే పరిస్థితులు లేవని అన్నారు. అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలో తెలియని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా సమస్య ఎదురైతే, చెప్పుకోవడానికి తెలిసిన పోలీసు అధికారైనా ఉండాలి, లేదా సొంత కులానికి చెందినవాడు ఎమ్మెల్యే అయి ఉండాలి అని పవన్ వ్యాఖ్యానించారు. 

ఏపీ రాజకీయాల్లో కౌన్సిలర్ స్థాయి వ్యక్తులు కూడా బెదిరించేవారేనని విమర్శించారు. గల్ఫ్ దేశాల్లో బతకగలిగిన మనం ఇక్కడ ఎందుకు బతలేకపోతున్నాం? అని ఆక్రోశించారు. అవినీతి రహిత రాజకీయాలే తన లక్ష్యం అని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Related posts

షర్మిల పై మంత్రి నిరంజన్ రెడ్డి వివిదాస్పద వ్యాఖ్యలు !

Drukpadam

ప్రాజెక్ట్ లను సెంట్రల్ బోర్డు కు అప్పగించడంపై రెండు రాష్ట్రాలు మెలిక!

Drukpadam

టీఆర్ యస్ లో ఎన్నికల హడావుడి …జిల్లా పార్టీ నిర్మాణం లో మంత్రులే కీలకం !

Drukpadam

Leave a Comment