Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిప్రదాత…..ప్రజా యుద్ధ నౌక గద్దర్ కన్నుమూత…

  • ఇటీవల గుండెపోటుకు గురైన గద్దర్
  • అపోలో ఆసుపత్రిలో చేరిన ప్రజా యుద్ధనౌక
  • ఆరోగ్యం విషమించి ఈరోజు తుదిశ్వాస 
  • తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్
  • పాటలతో పోరాటానికి ఊపిరిలూదిన వ్యక్తి

తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రధాత … అనేక ప్రజా ఉద్యమాలకు దీక్షుచి ,యువతను ప్రజాఉద్యమాల వైపు మళ్లించడంలో ఆయన చేసిన కృషి మరవలేనిది . ప్రపంచ చరిత్రలోనే అరుదైన కళాకారుడు ,కోట్లాది ప్రజలను ఆయన పాటలతో చైతన్యం నింపి ఉర్రుతలు ఊగించారు.. అందుకే ఆయనకు ప్రజా యుద్ధ నౌక అనే పేరువచ్చింది …

గద్దర్(74) అసలు పేరు గుమ్మడి విఠల్ రావు , గుండెపోటుతో జులై 20 న మియాపూర్ లోని అపోలో హాస్పటల్ లో చేరారు . ఈనెల 3 వ తేదీన గుండెకు శస్త్రచికిత్స చేశారు . వైద్యులు కూడా బాగానే ఉన్నట్లు చెప్పారు . తర్వాత ఊపిరి తిత్తుల సమస్యతో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మృతి చెందినట్లు ప్రకటించారు . అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇటీవల గుండెపోటు రావడంతో ఆయనను హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. చివరికి ఆరోగ్యం విషమించి ఈరోజు తుదిశ్వాస విడిచారు.

1949లో తూప్రాన్‌లో జన్మించిన గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ” పొడుస్తున్న పొద్దుమీద పోరు తెలంగాణమా …కోట్లాది ప్రాణమా” అంటూ రాష్ట్రంలో సాంస్కృతిక విప్లవాన్ని రగిలించారు …ఆయన జీవితాంతం పేదల ,బడుగు బలహీనవర్గాల కోసం పరితపించారు .72 సంవత్సరాల వయస్సు లోను కాలుకు గజ్జెకట్టి స్టేజీమీద గంతులేసిన ఒక మహా కళాకారుడు , మేధావి , అనేక మంది కళాకారులను తయారు చేశారు .ఆయన స్పూర్తితో అనేక మంది ఉద్యమాల్లోకి ఆకర్షించిన గొప్పవ్యక్తి … గద్దర్ లేని తెలంగాణ ఉద్యమాన్ని ఊహించడం కష్టమని పలువు పేర్కొంటున్నారు . అనేకమంది ఆయన మరణవార్త విని దిగ్బ్రాంతికి లోనయ్యారు . కన్నీరు మున్నీరు అయ్యారు .

ఎన్నో పాటలతో ఉద్యమానికి ఊపిరి పోశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. 

1975లో కెనరా బ్యాంకులో క్లర్క్‌గా గద్దర్ చేరారు. తర్వాత వివాహం చేసుకున్నారు. ఆయన భార్య పేరు విమల. ఆయనకు ముగ్గురు పిల్లలు– సూర్యుడు, చంద్రుడు (2003లో అనారోగ్యంతో చనిపోయారు), వెన్నెల ఉన్నారు.

మాభూమి సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించారు. యాదగిరి పాడిన ‘బండెనక బండి కట్టి’ అనే పాటను ఆయనే పాడి, ఆడారు. 1984 లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1985లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడారు. 1997 ఏప్రిల్ 6న పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆయన శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఒక బుల్లెట్ ఆయన శరీరంలో ఇప్పటికీ ఉంది.

గద్దర్ ఒక గొప్ప సామజిక విప్లవకారుడు …ఆయన పాటల ద్వారా తెలుగు ప్రజలను ఉర్రుతలు ఊగించారు . …తెలుగు ప్రజలకు ఆయన లేని లోటు పూడ్చలేనిది …ఏపీ సీఎం జగన్ అన్నారు . తన ఆటపాటల ద్వారా సమాజాన్ని మంచి వైపు ఆలోచన చేసేలా చేశారని నివాళులు అర్పించారు .వారి కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు . ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు , లోకేష్ , పవన్ కళ్యాణ్ , తదితరులు సంతాపం ప్రకటించారు .

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక ప్రత్యేక సందేశం పంపుతూ టీపీసీసీ అధ్యక్షుడు ,రేవంత్ రెడ్డి , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ,ఏఐసీసీ ఇంచార్జి మాణిక్యరావు ఠాక్రే , ఎమ్మెల్యే సీతక్క , వి .హనుమంతరావు అపోలో ఆసుపత్రికి చేరుకొని తదితరులు గద్దర్ మృతికి దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించారు .

అపోలో ఆసుపత్రి నుంచి ప్రజల సందర్శనార్థం ఎల్ బి స్టేడియం కు తరలించారు . ప్రొఫెసర్ హరగోపాల్ , టీపీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి , మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, విమలక్క తదితరులు భౌతిక కాయాన్ని సందర్చించి నివాళులు అర్పించారు …

తెలంగాణ అసెంబ్లీ నివాళు …

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా గద్దర్ మృతి వార్త తెలుసుకున్న ప్రభుత్వం నివాళులు అర్పించింది..మంత్రి కేటీఆర్ గద్దర్ మృతికి ప్రభుత్వం తరుపున నివాళులు అర్పించారు . భూప్రపంచం ఉన్నంతకాలం ఆయన స్మృతులు మిగిలి ఉంటాయని అన్నారు . సీఎం కేసీఆర్ గద్దర్ మృతికి నివాళులు అర్పిస్తూ తన జీవితాన్ని ప్రజలకే ఆయన అంకితం చేశారని అన్నారు . తన గళంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారని అన్నారు .

Related posts

అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణకు సాయం చేయాలని ప్రధాని మోదీని అడిగాం: మల్లు భట్టి విక్రమార్క!

Ram Narayana

తమ్మినేనిని పరామర్శించిన డిప్యూటీ సీఎం భట్టి,రెవిన్యూ మంత్రి పొంగులేటి!

Ram Narayana

మహాత్మా గాంధీ అతి పెద్ద విగ్రహం హైద్రాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం ..గున్న రాజేందర్ రెడ్డి హర్షం ..

Ram Narayana

Leave a Comment