Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు… గద్దర్ చివరి కోరిక ఏంటంటే…!

  • తీవ్ర అనారోగ్యంతో గద్దర్ మృతి
  • ప్రజల సందర్శనార్థం ఎల్బీ స్టేడియంకు భౌతికకాయం తరలింపు
  • రేపు మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలు
  • సీఎస్ శాంతికుమారికి ఆదేశాలు జారీ చేసిన సీఎం కేసీఆర్

తన పాటతో తెలంగాణ జనుల్లో చైతన్యం రగిల్చి, వారిని ఉద్యమం దిశగా నడిపించిన ప్రజా గాయకుడు గద్దర్ తీవ్ర అనారోగ్యంతో మృతి చెందడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 

గద్దర్ జీవితాంతం చేసిన త్యాగాలు, ప్రజాసేవకు గౌరవసూచకంగా ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు గద్దర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి, అందుకు సంబంధించిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర సీఎస్ శాంతికుమారికి స్పష్టం చేశారు. తన జీవితకాలం ప్రజల కోసమే బతికిన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ తెలంగాణ గర్వించే బిడ్డ అని సీఎం కేసీఆర్ కొనియాడారు. 

గద్దర్ అంత్యక్రియలు అక్కడే!

కాగా, గద్దర్ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం హైదరాబాదులో నగరంలోని ఎల్బీ స్టేడియంకు తరలించారు. రేపు మధ్యాహ్నం తర్వాత గద్దర్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఆల్వాల్ లో గద్దర్ స్థాపించిన మహాబోధి విద్యాలయంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక్కడే అంత్యక్రియలు జరిపించాలన్న గద్దర్ కోరిక అని ఆయన తనయుడు వెల్లడించారు. గద్దర్ అర్ధాంగి విమల కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు.

 గద్దర్ మృతిపై సీఎం కేసీఆర్ భావోద్వేగ స్పందన

  • ఈ మధ్యాహ్నం కన్నుమూసిన గద్దర్
  • గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వైనం
  • చికిత్స పొందుతూ మృతి
  • దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్
  • తెలంగాణ సమాజం గొప్ప ప్రజాకవిని కోల్పోయిందని వెల్లడి
CM KCR emotional response on Gaddar demise

జన గాయకుడు, ప్రజా ఉద్యమకారుడు గద్దర్ మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గద్దర్ తెలంగాణ పాటకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిన ప్రజా వాగ్గేయకారుడు అని కీర్తించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో తన పాట ద్వారా పల్లెపల్లెనా భావజాల వ్యాప్తి చేశారని కొనియాడారు. గద్దర్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు.

సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా, తెలంగాణ కోసం గద్దర్ చేసిన సాంస్కృతిక పోరాటాన్ని, గద్దర్ తో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. సాధారణ బుర్రకథా కళాకారుడిగా గద్దర్ కళాజీవితం ప్రారంభమైందని, ఆపై విప్లవ రాజకీయాలతో మమేకమైందని, తదనంతరం తెలంగాణ సాధన కోసం సాగిన ఉద్యమంలో సాంస్కృతిక పోరాటం ద్వారా ఉన్నతస్థాయికి చేరిందని కేసీఆర్ వివరించారు. 

తెలంగాణ కోసం తన ఆటపాటలతో ప్రజల్లో స్వరాష్ట్ర చైతన్యాన్ని రగిల్చారని, ప్రజా యుద్ధనౌకగా జన హృదయాల్లో నిలిచారని అభివర్ణించారు. గద్దర్ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసి, ప్రజల కోసమే బతికాడని, గద్దర్ మృతితో తెలంగాణ సమాజం ఒక గొప్ప ప్రజాకవిని కోల్పోయిందని ఆవేదన వెలిబుచ్చారు. కవిగా ప్రజా కళలకు, ఉద్యమాలకు గద్దర్ చేసిన సేవలు మరపురానివని కొనియాడారు. 

ఆయన లేని లోటును పూడ్చలేమని, ప్రజా కళాకారులకు, కవులకు మరణం ఉండదని తెలిపారు. ప్రజాకళలు వర్ధిల్లినంత కాలం గద్దర్ పేరు అజరామరంగా నిలిచి ఉంటుందని పేర్కొన్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Related posts

మా లక్ష, లక్ష్యం నెరవేరింది…రండి తలలు లెక్కపెట్టుకోండి …కూనంనేని సవాల్ …

Drukpadam

ఢిల్లీలో రేవంత్‌రెడ్డి కోసం అధికారిక నివాసం రెడీ.. కేసీఆర్ నేమ్‌ప్లేట్ తొలగింపు

Ram Narayana

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పై అరెస్టు వారెంట్…

Ram Narayana

Leave a Comment