Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
పార్లమంట్ న్యూస్ ...

బీజేపీకి మిత్రపక్షం షాక్.. అవిశ్వాస తీర్మానానికి మద్దతు!

  • మిజోరాం ఎన్డీయే భాగస్వామి ఎంఎన్ఎఫ్ అనూహ్య నిర్ణయం
  • అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చినప్పటికీ కాంగ్రెస్‌కు అనుకూలం, బీజేపీకి వ్యతిరేకం కాదని వెల్లడి
  • హింసను అదుపు చేయడంలో మణిపూర్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ

బీజేపీకి ఎన్డీయే కూటమిలోని ఓ పార్టీ షాకిచ్చింది. పార్లమెంట్‌లో ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానానికి మిజోరాంకు చెందిన ఎన్డీయే భాగస్వామి ఎంఎన్ఎఫ్ మద్దతివ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎంఎన్ఎఫ్ ఎంపీ లాల్రోసంగా తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… పొరుగున ఉన్న మణిపూర్‌ అల్లర్ల ఘటన తమను తీవ్రంగా కలచివేసిందన్నారు. మణిపూర్‌లో చెలరేగిన హింసాకాండను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. అందుకే తాము అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తున్నట్లు తెలిపారు.

అయితే తాము అవిశ్వాసానికి మద్దతివ్వడం ద్వారా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నామని కాదని, బీజేపీని వ్యతిరేకిస్తున్నామని భావించరాదన్నారు. ప్రభుత్వాలు ముఖ్యంగా మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దడంలో విఫలమైందన్నారు. ఆ రాష్ట్రంలోని ప్రజల పరిస్థితి తమను తీవ్రంగా కలచివేస్తోందన్నారు. ఈ అంశపై తమ పార్టీ అధ్యక్షుడు, మిజోరామ్ ముఖ్యమంత్రి జొరాంతంగతో మాట్లాడామని, అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వడంపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశారని చెప్పారు. ఈ నేపథ్యంలో తాను అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేస్తానన్నారు.

Related posts

పీయూష్ గోయల్‌పై I.N.D.I.A. కూటమి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

Ram Narayana

మణిపూర్ హింస సిగ్గుచేటని అంగీకరిస్తున్నాం.. ప్రతిపక్షాలు ఈ అంశంపై నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయి!: అమిత్ షా

Ram Narayana

‘గే’ పురుషులకు నెలసరి ఉంటుందా? కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ సూటి ప్రశ్న

Ram Narayana

Leave a Comment