Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోర్ట్ తీర్పులు

దేవినేని, నల్లారి లను సోమవారం వరకు అరెస్ట్ చేయబోమని హైకోర్టుకు తెలిపిన ఏఏజీ

  • అంగళ్లు ఘటనలో దేవినేని ఉమ, నల్లారి కిషోర్‌‌కుమార్‌‌ రెడ్డిపై కేసు పెట్టిన పోలీసులు
  • ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లిన నేతలు
  • తదుపరి విచారణ ఈనెల 14వ తేదీకి వాయిదా   

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం అంగళ్లులో జరిగిన ఘర్షణల కేసులో టీడీపీ నేతలు దేవినేని ఉమ, నల్లారి కిషోర్‌‌కుమార్‌‌ రెడ్డిలకు సోమవారం వరకు ఊరట లభించింది. సోమవారం వరకు వారిద్దరినీ అరెస్టు చేయబోమని హైకోర్టుకు అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) తెలిపారు. అంగళ్లు ఘటనకు సంబంధించి దేవినేని ఉమ, నల్లారి కిషోర్‌‌కుమార్‌‌ రెడ్డిలపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దేవినేని, నల్లారి.. హైకోర్టులో పిటిషన్ వేశారు. వీరి తరఫున సీనియర్ న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, ఎన్వీ సుమంత్ వాదనలు వినిపించారు. అయతే వివరాలు అందించేందుకు తమకు సోమవారం వరకు సమయం కావాలని ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీంతో వారిని సోమవారం దాకా అరెస్టు చేయబోమని కోర్టుకు అదనపు అడ్వకేట్ జనరల్ తెలియజేశారు. తదుపరి విచారణను ఈనెల 14వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.

Related posts

స్కిల్ కేసులో నారా లోకేశ్ కు అక్టోబర్ 4 వరకు బెయిల్ మంజూరు.. ఫైబర్ గ్రిడ్ కేసు విచారణ వాయిదా!

Ram Narayana

చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణను వాయిదా వేసిన ఏసీబీ కోర్టు

Ram Narayana

పదమూడేళ్ల అమ్మాయి.. పాతికేళ్ల అబ్బాయి.. ఇద్దరి సాన్నిహిత్యం ప్రేమేనని తేల్చిన బాంబే హైకోర్టు

Ram Narayana

Leave a Comment