అంతర్జాతీయంక్రైమ్ వార్తలు

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం

  • మినియాపొలిస్ నగరంలో శుక్రవారం రాత్రి ఓ మ్యూజిక్ షోలో కాల్పుల కలకలం
  • ఇద్దరు వ్యక్తులు కాల్పులకు తెగబడి పారిపోయినట్టు గుర్తించిన పోలీసులు
  • ఘటనలో ఒకరి మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు
  • నిందితుల కోసం గాలింపు

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. మిన్నెసొటా రాష్ట్రంలోని మినియాపొలిస్ నగరంలో శుక్రవారం రాత్రి ఓ పంక్ రాక్ షోలో (మ్యూజిక్ షో) కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఇద్దరు వ్యక్తులు ఈ కాల్పులకు తెగబడ్డట్టు తెలుస్తోంది. ఆ తరువాత వారు అక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్లిపోయారని అధికారులు భావిస్తున్నారు. కాల్పుల్లో గాయపడ్డ వారు తమంతట తాముగా ఆసుపత్రికి వెళ్లారు. 

మ్యూజిక్ షోలో పాల్గొన్న వారిని నిందితులు కావాలనే టార్గెట్ చేసుకుని ఉంటారని పోలీస్ చీఫ్ బ్రయన్ ఓ హారా మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తి ఎవరనేది పోలీసులు ఇంకా గుర్తించలేదు. ‘‘అప్పటివరకూ అంతా బానే ఉంది. కానీ ఆ మరుక్షణమే కాల్పులు జరిగాయి. తూటాల నుంచి తప్పించుకునేందుకు అందరూ నేలపై పడుకున్నారు’’ అని ఆ మ్యూజిక్ కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకుడు ఒకరు తెలిపారు. కాగా, నిందితుల కోసం పోలీసులు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు.

Related posts

జపాన్‌లో 7.4 తీవ్రతతో భారీ భూకంపం…

Ram Narayana

గోద్రా రైలు దహనం కేసు దోషులకు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు..!

Ram Narayana

నిద్రమాత్రలిచ్చి.. ప్రియుడితో కుమార్తెపై అత్యాచారం చేయించిన తల్లి!

Ram Narayana