Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

2047 నాటికి తలసరి ఆదాయం రూ.2 లక్షల నుండి రూ.14.9 లక్షలకు పెరుగుదల…

-2047 నాటికి తలసరి ఆదాయం రూ.2 లక్షల నుండి రూ.14.9 లక్షలకు పెరుగుదల
-14లో సగటు ఆదాయం రూ.4.4 లక్షలు కాగా, ప్రస్తుతం రూ.13 లక్షలకు పెరుగుదల
-2046-47 ఆర్థిక సంవత్సరానికి 25 శాతం ఐటీ ఫైలర్లు అప్‌గ్రేడ్
-2023లో దాఖలైన టాప్ 5 రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, బెంగాల్

2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం దాదాపు 25 ఏళ్ల తర్వాత అంటే 2046-47 ఆర్థిక సంవత్సరానికి ఏడున్నర రెట్లు పెరిగి రూ.14.9 లక్షలకు చేరుకుంటుందని ఎస్బీఐ రీసెర్చ్ పేర్కొంది. ఇటీవల ఐటీఆర్ ఫైలింగ్ పెరుగుదల ఆధారంగా అంచనా వేసింది. ఐటీఆర్ ఫైలింగ్ ఆధారంగా అసెస్‌మెంట్ ఇయర్ 14లో సగటు ఆదాయం రూ.4.4 లక్షలు కాగా, ఇప్పుడు రూ.13 లక్షలకు పెరిగినట్లు తెలిపింది. ఇది 2047 నాటికి రూ.49.7 లక్షలకు పెరుగుతుందని అంచనా వేసింది. సగటు ఆదాయం క్రమంగా పెరుగుతున్నట్లు వెల్లడించింది.

2012తో పోలిస్తే ప్రస్తుతం పన్ను చెల్లింపుదారులలో 13.6 శాతం మంది తక్కువ ఆదాయ పన్ను పరిమితి నుండి అప్‌గ్రేడ్ అయినట్లు తెలిపింది. అసెస్‌మెంట్ ఇయర్ 2023లో 68.5 మిలియన్ల మంది ఐటిఆర్‌ను దాఖలు చేయగా, వీరు రూ.5 లక్షల వరకు ఆదాయ సమూహంలో ఉన్నారు. రూ.5 లక్షల ఆదాయపు పన్ను పరిమితికి ఈసారి 8.1 శాతం పెరగగా, రూ.10-20 లక్షల ఆదాయపు పన్ను పరిమితిలోకి 3.8 శాతం ఐటీఆర్‌లు పెరిగాయి. రూ.20-50 లక్షల ఆదాయ సమూహంలో 1.5 శాతం, రూ.50 లక్షల నుండి రూ.1 కోట్ల ఆదాయ సమూహంలో 0.2 శాతం పెరిగినట్లు తెలిపింది.

2046-47 ఆర్థిక సంవత్సరం నాటికి 25 శాతం మంది ఐటీఆర్ ఫైలర్లు అత్యల్ప ఆదాయ గ్రూప్ నుండి అప్‌గ్రేడ్ అవుతారని అంచనా వేసింది. ఇందులో 17.5 శాతం మంది ఫైలర్లు రూ.5-10 లక్షల ఆదాయపు పన్ను పరిమితికి, 5 శాతం మంది రూ. 10-20 లక్షలకు, 3 శాతం మంది రూ. 20-50 లక్షల పరిమితికి పెరగనున్నట్లు తెలిపింది. 2047 నాటికి ఫైలర్లలో 0.5 శాతం మంది రూ.50 లక్షలు – రూ.1 కోటి ఆదాయ వర్గానికి, 0.075 శాతం మంది రూ.1 కోటి కంటే అధిక ఆదాయ వర్గానికి మారుతారని అంచనా వేసింది.

2047 నాటికి భారత జనాభా ప్రస్తుతం ఉన్న 1.4 బిలియన్ల నుండి 1.6 బిలియన్లకు పెరుగుతుందని అంచనా వేసింది. అదే సమయంలో, శ్రామిక శక్తి 2023లో 530 మిలియన్ల నుండి 2047లో 725 మిలియన్లకు పెరగవచ్చునని 2023లో ఇంకా టెక్స్ ఫైలర్లు 70 మిలియన్ల నుండి 2047లో 482 మిలియన్లకు పెరుగుతారని అంచనా వేసింది. 2023లో దాఖలైన ఐటీ రిటర్న్స్‌లో 48 శాతం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి.

Related posts

దొంగతనానికి గురైన చెరువు.. బీహార్‌లో షాకింగ్ ఘటన

Ram Narayana

బెంగాల్ లో 24 వేల స్కూల్ టీచర్ ఉద్యోగాలను రద్దు చేసిన హైకోర్టు…

Ram Narayana

ఉప్పొంగిన యుమున ఉపనది.. నోయిడాలో నీటమునిగిన వందలాది కార్లు

Ram Narayana

Leave a Comment