Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు’కు రఘురామ కృషంరాజుకు ఉన్న సంబంధం ఏమిటి ?పేర్ని నాని…

చంద్రబాబు’కు రఘురామ కృషంరాజుకు ఉన్న సంబంధం ఏమిటి ?పేర్ని నాని..
సంగం డెయిరీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని ధూళిపాళ్లను చంద్రబాబు కోరారు
అరాచకాలకు పాల్పడుతున్న జనార్దన్ రెడ్డిపై కేసులు పెట్టకూడదా?
సహకార డెయిరీ వ్యవస్థను చంద్రబాబు నాశనం చేశారు
టీడీపీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు
ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖామంత్రి పేర్ని నాని చంద్రబాబుపై మరోసారి మండిపడ్డారు. రఘురాంకృషంరాజు విషయంలో ఆయన కన్న ఎక్కువగా చంద్రభాను ఉలిక్కిపడుతున్నారని ఎందుకని ప్రశ్నించారు. ఆయనకు వీరికి మధ్య ఉన్న అక్రమ సంబంధం బయటపడుతుందనే భయంతోనే చంద్రబాబు అండ్ కో కృషంరాజును వెనకేసుకు వస్తుందని అన్నారు. నేరం చేసిన వాళ్ళను కాపాడుకునేందుకు చంద్రబాబు అడ్డదార్లు తొక్కటం అలవాటే నన్నారు.
అరాచకాలకు పాల్పడుతున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డిపై కేసులు పెట్టకూడదా? అని ఏపీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. వైసీపీకి చెందిన దళిత కార్యకర్తపై జనార్ధన్ రెడ్డి హత్యాయత్నం చేశారని చెప్పారు. అరాచకాలకు పాల్పడిన వ్యక్తిని చంద్రబాబు వెనకేసుకురావడం కరెక్టేనా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు సిగ్గు, ఎగ్గు లేదని అన్నారు. ఇప్పుడున్నది చంద్రబాబు పాలన కాదని… జగన్ పాలన అని చెప్పారు.

ఏపీ లో సహకార డెయిరీ వ్యవస్థను నాశనం చేయటం కోసం సంగం డెయిరీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని ధూళిపాళ్ల నరేంద్రను గతంలో చంద్రబాబు కోరింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తే మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు అన్నారని చెప్పారు. ఏపీలో సహకార డెయిరీ వ్యవస్థను చంద్రబాబు సర్వనాశనం చేశారని ఆరోపించారు.

లక్ష జీవాలను చంపిన మొసలి ముసలితనంలో నీతులు చెప్పినట్టు చంద్రబాబు తీరు ఉందని విమర్శించారు. ఎంపీ రఘురామకృష్ణరాజుకు, చంద్రబాబుకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ప్రతి కేసును రఘురాజు కేసు మాదిరే ముగిద్దామని టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు సిగ్గులేకుండా చెపుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్ని డ్రామాలు ఆడిన మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని అన్నారు. చంద్రబాబు వేషాలను చూసి ప్రజలు నవ్వుకొంటున్నారని ఇప్పటికైనా వుద్ధాప్యం లో నిజాలు మాట్లాడటం , నీతిగా వ్యవహరించడం , అభివృద్ధికి సహకరించడం చేస్తే ప్రజలు క్షమిస్తారని అన్నారు. ప్రతి దాన్ని తప్పు అని చెప్పడం , పనికి పాలైన రాజకీయాలు చేయడం ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం, వ్యవస్థలను మేనేజ్ చేవడం మానుకొని మంచిని మంచి చెడును చెడు అని చెప్పగలగాలి అప్పుడే ప్రజలు బాబును నమ్ముతారని అన్నారు .

 

Related posts

నా మాట నమ్మిన వాళ్లు బాగుపడ్డారు: చంద్రబాబు…

Ram Narayana

వంటగదిలో యువతి జుట్టుకు మంటలు.. గమనించకుండా పనిచేసుకుంటూ పోయిన అమ్మాయి!

Drukpadam

మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద భారీగా పోలీసుల‌ మోహరింపు.. కార‌ణ‌మిదే!

Ram Narayana

Leave a Comment