ఒంటిపై హాట్ చాక్లెట్ పడి బాలికకు గాయాలు..
విస్తారా ఎయిర్ లైన్స్‌లో ఘటన
ఆగస్టు 11న న్యూఢిల్లీ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్ వెళుతున్న విమానంలో ఘటనబాలిక అల్లరి కారణంగా వేడివేడి చాక్లెట్ ఆమె ఒంటిపై పడిందన్న ఎయిర్‌లైన్స్ఎయిర్‌లైన్స్ ప్రామాణిక పద్ధతుల ప్రకారం బాలికకు ప్రాథమిక చికిత్స అందించామన్న సంస్థవిమానం ల్యాండవగానే అంబులెన్స్ ఏర్పాటు చేసి చిన్నారిని ఆసుపత్రికి తరలించినట్టు వెల్లడిఆసుపత్రి ఖర్చులను బాధిత కుటుంబానికి తిరిగి చెల్లిస్తామని స్పష్టీకరణ
గతవారం తమ విమానంలో ప్రయాణిస్తున్న ఓ పదేళ్ల బాలిక ఒంటిపై హాట్ చాక్లెట్ పడి గాయాలయ్యాయని విస్తారా ఎయిర్‌లైన్స్ బుధవారం ప్రకటించింది. బాలిక చికిత్సకు సంబంధించిన ఖర్చంతా తామే తిరిగి చెల్లిస్తామని పేర్కొంది. ఆగస్టు 11న ఢిల్లీ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు (జర్మనీ) బయలుదేరిన యూకే25 విమానంలో ఈ ఘటన వెలుగు చూసింది.
Save or share this story as a newspaper-style Epaper Clip: