Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
పార్లమంట్ న్యూస్ ...

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి నామినేట్ అయిన రాహుల్ గాంధీ

  • సుప్రీంకోర్టు తీర్పుతో రాహుల్ ఎంపీ సభ్యత్వం పునరుద్ధరణ
  • డిఫెన్స్ పై స్టాండింగ్ కమిటీకి నామినేట్ అయిన రాహుల్
  • వేటు పడక ముందు కూడా ఇదే కమిటీలో ఉన్న రాహుల్

తన ఎంపీ సభ్యత్వంపై నిషేధం ఎత్తివేయడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మళ్లీ లోక్ సభలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సభ్యత్వాన్ని పునరుద్ధరించిన వారం వ్యవధిలోనే ఆయనను డిఫెన్స్ పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి నామినేట్ చేశారు. ఈమేరకు లోక్ సభ సెక్రటేరియట్ బులెటిన్ విడుదల చేసింది. ఎంపీ పదవిపై వేటు పడక ముందు కూడా ఆయన అదే కమిటీలో ఉండటం గమనార్హం. 

మోదీ ఇంటి పేరుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సూరత్ కోర్టు రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ శిక్షపై ఆగస్టు 4న సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో ఆగస్టు 7న ఆయన ఎంపీ సభ్యత్వాన్ని మళ్లీ పునరుద్ధరించారు.

Related posts

పార్లమెంట్ లో బీజేపీ ఎంపీ తలకు గాయం.. రాహుల్ గాంధీ తోసేశాడని ఆరోపణ..

Ram Narayana

మణిపూర్ లో భారత మాతను చంపేశారు.. లోక్ సభలో రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు

Ram Narayana

రాష్ట్రపతి ప్రసంగంపై సోనియా గాంధీ కామెంట్… బీజేపీ ఆగ్రహం!

Ram Narayana

Leave a Comment