Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్ లకు స్పందన మామూలుగా లేదు!

  • మద్యం దుకాణాల లైసెన్స్ లకు ఎక్సైజ్ శాఖ ప్రకటన
  • ఆగస్టు 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ
  • ఆగస్టు 18తో ముగియనున్న గడువు
  • ఇప్పటివరకు 69,965 దరఖాస్తులు
  • ప్రభుత్వానికి రూ.1,399 కోట్ల ఆదాయం

తెలంగాణలో మద్యం దుకాణాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే. మద్యం దుకాణాల లైసెన్స్ పొందేందుకు ఎక్సైజ్ శాఖ ప్రకటన ఇవ్వగా, భారీగా స్పందన వస్తోంది. ఇవాళ ఏకంగా 25,925 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు మొత్తం 69,965 దరఖాస్తులు వచ్చాయి. 

2021లో కేవలం దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి రూ.1,357 కోట్లు రాగా, ఈసారి అంతకంటే ఎక్కువ ఆదాయం లభించింది. ఈ ఏడాది దరఖాస్తుల ద్వారా రూ.1,399 కోట్ల ఆదాయం వచ్చింది. 

దరఖాస్తుల స్వీకరణకు రేపు (ఆగస్టు 18) చివరి రోజు కాగా, దరఖాస్తులు వెల్లువెత్తే అవకాశం ఉంది. తెలంగాణలో 2,620 మద్యం దుకాణాల ఏర్పాటుకు ఈ నెల 4 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తు రుసుం కింద అభ్యర్థుల నుంచి రూ.2 లక్షలు వసూలు చేస్తున్నారు.

Related posts

ఏడాదిలోనే 5 రెట్లు పెరిగిన బీఆర్ఎస్ ఆదాయం.. తాజా ఆస్తుల విలువ రూ. 480 కోట్లకు జంప్

Drukpadam

భద్రాద్రిలో కన్నుల పండువగా సీతారాముల కల్యాణం.. !

Drukpadam

జీవో నెం.2 సస్పెన్షన్ ను స్వాగతించిన రాష్ట్ర పంచాయతీ పరిషత్…

Drukpadam

Leave a Comment