Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

పొంగులేటి టార్గెట్ గా …గులాబీ ఆకర్ష్ మంత్రం ….!

పొంగులేటి టార్గెట్ గా …గులాబీ ఆకర్ష్ మంత్రం ….
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు మారనున్న ఆయారాం ..గయారాంలు …
తెల్లం బాటలో ఇంకెంతమంది గులాబీ గూటికి …
పొంగులేటి శిబిరం పైనే గురి .
కోరం కనకయ్య కూడా లైన్లో ఉన్నారని ప్రచారం …ఖండించిన కనకయ్య
ఖమ్మం కాంగ్రెస్ లో కలకలం …?

ఖమ్మం జిల్లాలో ఇటీవల ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరారు ..ఆయన చేరిక కాంగ్రెస్ కు బలమనే అభిప్రాయాలు వచ్చాయి. రాష్ట్రంలో కూడా ఆయన చేరిక ఆసక్తి గా మారింది . ఎవరు అంగీకరించినా , అంగీకరించకపోయినా ఇది వాస్తవం కూడా …అయితే కాంగ్రెస్ లో కొత్తగా చేరినవారికి ,పార్టీలో ఎప్పటినుంచో పనిచేస్తున్నవారికి మధ్య ఐక్యత రాలేదు ..అంతే కాకుండా సీట్ల విషయంలో కొత్తగా వచ్చినవారు తమకు సీటు కావాలని కోరడం పై పాతవారు గుర్రుగు ఉన్నారు … పాతవారైనా ,కొత్తవారైనా సర్వేల ప్రకారం గెలిచే వారికే టికెట్స్ ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం చెపుతున్నప్పటికీ తమకు సీటు రాదనే నిర్దారణకు వచ్చినవారు పక్క చూపులు చూస్తున్నారు … కాంగ్రెస్ ఉన్నవారిని బీఆర్ యస్ ….బీఆర్ యస్ లో ఉన్నవారిపై కాంగ్రెస్ గాలం వేస్తున్నాయి….ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మరిన్ని చిత్ర ,విచిత్రాలు చూడాల్సి ఉంటుంది…

ప్రధానంగా కాంగ్రెస్ నేత పొంగులేటి టార్గెట్ గా బీఆర్ యస్ పార్టీ ఖమ్మం జిల్లాలో ఆకర్ష్ మంత్రం చేపట్టింది .దానికి కారణం లేకపోలేదు ,ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయన బీఆర్ యస్ ను పెద్ద దెబ్బకొట్టారు . ఎన్నికల్లో మరింత దెబ్బకొట్టాలని కసి పట్టుదలతో తిరుగుతున్నారు . ఆయన్ను దెబ్బకొట్టాలన్నీ బీఆర్ యస్ పార్టీ కూడా ఎత్తులు వేస్తుంది.దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.

నిన్నమొన్నటివరకు పొంగులేటి  అనుంగ అనుచరులుగా ఉన్న ఒక్కక్కరు ఆయనను వీడుతున్నారు . ఆయనతోపాటు అత్యంత ఆర్బాటంగా రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో  చేరిన భద్రాచలం కు చెందిన తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి  గులాబీ తీర్ధం పుచ్చుకున్నారు .   హైద్రాబాద్ బీఆర్ యస్ కార్యాలయంలో కేటీఆర్ సమక్షంలో మంత్రి పువ్వాడ అద్వర్మలో ఆయన చేరిక  జరిగింది. జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు  . మరికొంతమంది ఆయన బాటలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నారని బీఆర్ యస్ నేతలు చెపుతున్నారు .

జులై 2 న ఖమ్మం లో రాహుల్ గాంధీ సభ తర్వాత కాంగ్రెస్ లో కొంత స్తబ్దత ఏర్పడింది. పొంగులేటి కాంగ్రెస్ లో చేరాక ముందు ఉమ్మడి జిల్లాలో మూడు జనరల్ నియోజకవర్గాలకు మినహా అన్ని నియోజకవర్గాలకు ఇంచార్జిలను నియమించారు . దీంతో ఆయన ఏపార్టీలోకి వెళ్లిన ఖశ్చితంగా వారికీ సీటు ఇప్పిస్తారని నమ్మకం కలిగించారు . కానీ కాంగ్రెస్ లో చేరిన తర్వాత జరిగిన మొదటి మీడియా సమావేశంలోనే ఒక పక్క కోరం కనకయ్య , మరో పక్క పాయం వెంకటేశ్వర్లు ను కుర్చోబెట్టుకొని కాంగ్రెస్ లో సర్వే ఆధారంగానే టికెట్స్ వస్తాయని చెప్పారు . ఈ సమావేశంలో వైరా, సత్తుపల్లి ,అశ్వారావుపేట ,భద్రాచలం , మధిర ,పినపాక ,ఇల్లందు టికెట్స్ ఆశిస్తున్నవారు ఉన్నారు . అప్పుడే వారి ముఖ కవళికలు మారాయి. కానీ ఎదో ఆశ పొంగులేటిని నమ్ముకుంటే టికెట్ వస్తుందనే నమ్మకం వారిలో ఉంది. అది కశ్చితంగా రాదని తెలిస్తే వారు ఆయన శిబిరం నుంచి జంప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు . దానిలో భాగంగానే భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు కు టికెట్ ఆశచూపించి బీఆర్ యస్ లోకి ఆకర్షించారు …ఆయన భవిష్యత్ భాద్యత మాదే అని పార్టీ కండువా కప్పిన మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు . కాంగ్రెస్ ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లుగా ఉంటుందని భావించే వెంకట్రావు బీఆర్ యస్ తిరిగి చేరారని అన్నారు . భద్రాచలం అభివృద్ధి బీఆర్ యస్ తోనే సాధ్యమని తాను నమ్ముతున్నట్లు చెప్పారు . బీఆర్ యస్ కు భద్రాచలం లో సరైన అభ్యర్థి లేరు . కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ అభ్యర్థిగా ఉన్న పొదెం వీరయ్య ఉన్నారు అందువల్ల తెల్లం వెంకట్రావు కు కాంగ్రెస్ లో ఎలాగూ టికెట్ రాదు దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న బీఆర్ యస్ టికెట్ ఇస్తామని హామీతోనే చేరినట్లు ఆయన అనుయాయులు అంటున్నారు ….

Related posts

రాజకీయాల్లో నీతికి పాతర …అన్ని పార్టీల్లో జంపింగ్ లు

Ram Narayana

సీఎం కేసీఅర్ పై తుమ్మల సంచలన వ్యాఖ్యలు…

Ram Narayana

కాంగ్రెస్ వచ్చాకే యూనివర్సిటీని మూసివేస్తున్నట్లు దిక్కుమాలిన ప్రచారం:రేవంత్ రెడ్డి

Ram Narayana

Leave a Comment