తెలుగు రాష్ట్రాలు

 వల్లభనేని వంశీ కాన్వాయ్‌కి సూర్యాపేట జిల్లాలో ప్రమాదం!

  • విజయవాడ-హైదరాబాద్ 65వ జాతీయ రహదారిలోని కాశీంపేట వద్ద ఘటన
  • ఉదయం విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తోన్న ఎమ్మెల్యే
  • కాన్వాయ్‌లోని రెండు వాహనాలు ఢీ.. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు

గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ కాన్వాయ్‌కి ప్రమాదం జరిగింది. విజయవాడ- హైదరాబాద్ 65వ జాతీయ రహదారిలో సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కాశీంపేట వద్ద ఈ సంఘటన జరిగింది. వల్లభనేని వంశీ శనివారం ఉదయం కాన్వాయ్‌లో విజయవాడ నుండి హైదరాబాద్‌కు బయలుదేరారు. తెలంగాణ రాష్ట్రంలోని కాశీంపేట వద్ద ఈ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. కాన్వాయ్‌లోని చివరి రెండు వాహనాలు ఒకదానికొకటి పరస్పరం ఢీకొన్నాయి. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. కానీ రెండు వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి.

Related posts

కడుపు మండి మాట్లాడుతున్నాను… జైల్లో ఉండాల్సింది చంద్రబాబులాంటి వారు కాదు: మోత్కుపల్లి

Ram Narayana

చార్జీల మోత మోగిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్!

Ram Narayana

నీటివాటా పాపం బీఆర్ యస్ దే…మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి …

Ram Narayana