Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఖమ్మం లో మంత్రి అజయ్ హ్యాట్రిక్ కొట్టనున్నారా …?

ఖమ్మం లో మంత్రి అజయ్ హ్యాట్రిక్ కొట్టనున్నారా …?
ఖమ్మం అభివృద్ధి తనను గెలిపిస్తుందన్న నమ్మకంతో ఉన్న అజయ్
తాను ఈసారి ఖమ్మం నుంచి పోటీచేయడంలేదని జరిగిన ప్రచారం పై గుస్సా
తనకు వ్యతిరేకంగా ఉన్నవారిపై కేసులు ,పోలిసుల వేధింపులు ఉంటాయని ప్రచారం
గత రెండు ఎన్నికల్లో హేమ హేమీలను ఓడించి అసెంబ్లీలోకి అడుగు పెట్టిన పువ్వాడ
మూడవసారి గెలిస్తే చరిత్ర సృష్టించడమే…

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలకమైన ఖమ్మం అసెంబ్లీకి బీఆర్ యస్ నుంచి తిరిగి రంగంలోకి దిగబోతున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హ్యాట్రిక్ కొట్టనున్నారా …? లేదా అనేది ఆసక్తిగా మారింది . గత రెండు టర్మ్ లుగా గెలుపొందిన పువ్వాడ అజయ్ ముచ్చటగా మూడవసారి గెలవడం ద్వారా హ్యాట్రిక్ కొట్టాలని గట్టి పట్టుదలతో ఉన్నారు … మొదటిసారి 2014 లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన పువ్వాడ అజయ్ టీడీపీ నుంచి పోటీచేసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను ఓడించారు …2018 రెండవసారి టీఆర్ యస్ టికెట్ పై పోటీచేసి తెలుగుదేశం ,కాంగ్రెస్, సిపిఐ పొత్తులో భాగంగా టీడీపీ తరుపున పోటీచేసిన నామ నాగేశ్వరరావు ఓడించారు .హేమ హేమీలైన ఇద్దరు నాగేశ్వరరావు లను ఓడించడం ద్వారా జిల్లాలో చరిత్ర సృష్టించిన నాయకుడిగా మిగిలారు …కాంగ్రెస్ నుంచి బీఆర్ యస్ లో చేరిన తర్వాత ఖమ్మం నియోజకవర్గంలో ఆయనకు తిరుగు లేకుండా పోయింది..కాంగ్రెస్ లో ఉండగానే వాడవాడ తిరిగిన ఎమ్మెల్యేగా పని రాక్షసుడిగా పేరు తెచ్చుకున్నారు. ఒక పని వెంటపడితే దాన్ని సాధించే వరకు వదిలి పెట్టె స్వభావం కాదు ఆయనది… అందుకే ఆయన పట్టు పడితే ఉడుం పట్టే అనే అభిప్రాయం ఉంది. …

జిల్లా కేంద్రంగా ఉన్న ఖమ్మం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే కు మొదటిసారిగా కేసీఆర్ మంత్రివర్గంలో స్థానం లభించింది. దానికి తగ్గట్లుగా ఆయన నియోజకవర్గ కేంద్రమైన ఖమ్మం పై కేంద్రీకరించారు . అంతకు ముందు ఉన్న కాలేజీ వ్యవహారాలు పూర్తిగా వదిలేసి పూర్తీ కాలం రాజకీయాలపై ద్రుష్టి పెట్టారు . సుమారు రూ. 2500 కోట్లతో అభివృద్ధి పనులు చేశారు . ఖమ్మం రూపు రేఖలు మార్చారు …డివైడర్లు , సెంట్రల్ లైటింగ్ , రోడ్ల ఎడల్పు , కూడళ్ల పెద్దవిగా చేయడం , ప్రతి ప్రాంతంలో కూరగాయల మార్కెట్ల ఏర్పాటు , రోడ్లు డ్రైనులు , డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, కొత్త బస్సు స్టాండ్ ఏర్పాటు , ఐ టి హబ్ , కొత్త కలెక్టరేట్ , మున్సిపల్ కార్పొరేషన్ నూతన భవనం , వైకుంఠ ధామాలు, లకారం ట్యాంక్ బండ్ , ప్యారడైజ్ వాకర్స్ పార్క్ , ముస్తఫా నగర్ రోడ్ల వెడల్పు , అగ్రహారం రైల్ బ్రిడ్జి , రఘునాథ మండలం లో రోడ్లు , మంచినీటి సౌకర్యాలు , ఇలా అనేకం ఉన్నాయి.ఖమ్మం అభివృద్ధి పై మిగతా నియోజకర్గాల ఎమ్మెల్యేలు సైతం ఖమ్మం లాగా మా నియోజకవర్గాలను కూడా అభివృద్ధి చేయండని కోరారంటే ఆయన ఖమ్మం పై ఎంత ఫోకస్ పెట్టారో అర్థం చేసుకోవచ్చు …

ఖమ్మం సీటు ఆయనకు రాదనే ప్రచారం పై

ఈసారి ఖమ్మం అసెంబ్లీ సీటు పువ్వాడ అజయ్ కు రాదని ఆయన్ను హైద్రాబాద్ లోని కూకట్ పల్లి నుంచి పోటీచేయించ బోతున్నారని ప్రచారం కొంతకాలం క్రితం జరిగింది…ఆసందర్భంగా ప్రచారం చేస్తున్న వారిపై ఆగ్రహం ప్రకటించారు … ఇక్కడ నుంచి ఎందుకు పోతాం రా బై …పీ .. కా …అంటూ వాట్సాప్ పోస్టులపై మండి పడ్డారు …. ఇక్కడ దంచాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు…వారిని దంచిన తర్వాతనే పోతానని కుండబద్దలు కొట్టారు …

ఖమ్మంలో బచ్చాను పెట్టి గెలిపిస్తానని పొంగులేటి అన్న మాటలపై …

పొంగులేటి కాంగ్రెస్ లో చేరకముందే ఒక సమావేశంలో మంత్రి పై విమర్శలు చేస్తూ …ఖమ్మం లో పోటీపై స్పందించారు ..ఆయన పోటీచేస్తారన్న ప్రచారాన్ని ఖండిస్తూ …. నేను పోటీచేయాలా ..ఖమ్మం నుంచి బచ్చాను పెట్టి గెలిపిస్తానని ఛాలంజ్ చేశారు …దీనిపై మంత్రి గట్టి కౌంటర్ ఇచ్చారు ..ఆయన పోటీచేయడానికి బయపడుతున్నాడు …బచ్చాను పెడతాడట… ఆయన్నే వచ్చి పోటీచేయమని సవాల్ విసిరారు …

నియోజకవర్గంలో ఏ చిన్న అవకాశాన్ని వదలటం లేదు …కులాలవారీగా , వర్గాలవారీగా , ప్రాంతాలవారీగా , అన్ని సెక్షన్ ను టచ్ చేస్తున్నారు …తన యంత్రాగాన్ని సిద్ధం చేసుకున్నారు . గెలుపు వ్యూహాలకు పదును పెడుతున్నారు . .. వాడవాడ పువ్వాడ కార్యక్రమాలు , చిన్న చిన్న సమస్యల పరిష్కరంలో అధికారులను పురమాయిస్తున్నారు . ఖమ్మం నగరంను అనుకుని ప్రవహిస్తున్న మున్నేరు వరదలకు కాలనీలు అన్ని జలమయమై ప్రజలు ప్రతిసంవత్సరం ఇబ్బందులు పడుతున్నందున వారికీ ఇబ్బందులు రాకుండా రిటైనింగ్ వాల్ కట్టించేందుకు ప్రభుత్వం నుంచి ఇటీవలనే నిధులు మంజూరి చేయించారు . మున్నేరు పై పాత బ్రిడ్జి స్థానే తీగల బ్రిడ్జి నిర్మాణం కోసం 180 కోట్లు మంజూరు చేయించారు …

మంత్రిపై విమర్శలు …ఆరోపణలు …

అదే సందర్భంలో ఆయనపై ఆరోపణలు , విమర్శలు లేకపోలేదు….తనకు వ్యతిరేకంగా ఉన్నవారిపట్ల కఠినంగా వ్యవహరిస్తారని పోలీస్ కేసులు పెట్టించి వేదిస్తారని చెడ్డపేరును సైతం మూటగట్టుకున్నారు … తమకు అనుకూలమైన అధికారులను పోస్టింగ్ చేయించుకోవడం, వారిద్వారా తమ వ్యతిరేకులను ఇబ్బందులు పెట్టడం జరుగుతుందనే విమర్శలు ఉన్నాయి. ఒక హాస్పటల్ మరో మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ నిర్మాణాల విషయంలో మంత్రి అడ్డుపుల్ల వేశారని ఆరోపణలు ఉన్నాయి. రఘునాథపాలెం మండలంలోని కొండలను కరిగించి కోట్లాది రూపాయల మట్టి అమ్ముకున్నారని ఆయన వ్యతిరేకులు తరుచు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై మంత్రి అనేక సార్లు ఖండించినప్పటికీ ప్రచారం మాత్రం ఆగటంలేదు . మంత్రి అభివృద్ధి గెలిపిస్తుందా …? హ్యాట్రిక్ కొడతారా ..? లేక ఆయనపై వచ్చిన ఆరోపణలు ప్రతికూల ఫలితాలు ఇస్తాయా ..? ఆయన ప్రత్యర్థులు ఎవరు … అనేది చర్చనీయాంశంగా మారింది…..చూద్దాం ఏమి జరుగుతుందో…..!

Related posts

బిగ్ బ్రేకింగ్.. రాజా సింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేసిన బీజేపీ

Ram Narayana

తుంగతుర్తి బీ-ఫామ్ నాకే… పార్టీ మార్పుపై స్పందించిన కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్

Ram Narayana

సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి …

Ram Narayana

Leave a Comment