Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా , ఇల్లందు బీఆర్ యస్ అభ్యర్థుల మార్పు ….?

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా , ఇల్లందు బీఆర్ యస్ అభ్యర్థుల మార్పు ….?
ఇప్పటికే పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం
రెండు సీట్లలో అభ్యర్థులపై కొనసాగుతున్న కసరత్తు
వైరా లో మదన్ లాల్ , ఇల్లందుకు గుమ్మడి అనురాధ లపేర్లు ..
మరో సీట్ పై పీఠముడి ….బుజ్జగింపులు పర్వంలో పార్టీ నాయకత్వం
మరి కొన్ని సీట్లపై అభ్యంతరాలు … కేసీఆర్ నిర్ణయం కోసం ఎదురు చూపులు

అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక వేళ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ఖమ్మం జిల్లాలో ఇటు అధికార బీఆర్ యస్ ,అటు కాంగ్రెస్ అభ్యర్థులపై ఆయారాం ,గయారాంల వ్వ్యహారం తెరపైకి వస్తుంది….ప్రధానంగా బీఆర్ యస్ లో ఉమ్మడి జిల్లాలో ముగ్గురు సిట్టింగ్ అభ్యర్థులను మార్చుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.దీన్ని బీఆర్ యస్ వర్గాలు కూడా ఖండించడంలేదు …ప్రధానంగా గత ఎన్నికల్లో స్వత్రంత్ర అభ్యర్థిగా పోటీచేసి అధికార పార్టీ కండువా కప్పుకున్న లావుడ్య రాములు నాయక్ టికెట్ ఇచ్చే విషయంపై చాలాకాలం నుంచే సందేహాలు ఉన్నాయి. ఆయనకు టికెట్ ఇస్తే నష్టం జరుగుతుందని సర్వేల తేల్చి చెప్పడంతో ఆయన్ను పక్కన బెట్టి గతంలో అక్కడ పోటీచేసి ఓడిపోయిన మదన్ లాల్ వైపు
అధినేత కేసీఆర్ ముగ్గు చూపుతున్నారని విశ్వసనీయ సమాచారం….అదే సందర్భంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ భానోత్ చంద్రావతి పేరు పరిశీలనకు వచ్చినప్పటికీ మదన్ లాల్ అభ్యర్థిత్వం ఖరారు అయ్యే అవకాశం ఉంది ..రాములు నాయక్ కొడుకు ఇన్ కం టాక్స్ కమిషనర్ జీవన్ లాల్ పేరు వచ్చినప్పటికీ ,ఆయన మహబూబాబాద్ పార్లమెంట్ కూడా అడిగినట్లు తెలుస్తుంది.

ఇక కాంగ్రెస్ టికెట్ పై గెలిచి బీఆర్ యస్ లో చేరిన ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియకు టికెట్ ఇవ్వాలని అనుకున్న సర్వేల్లో ఆమె పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆమె అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టినట్లు సమాచారం …ఆమెకు టికెట్ ఇస్తే ఓడిస్తామని బీఆర్ యస్ నాయకులే అంటున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు … అక్కడ నుంచి మాజీ ఎమ్మెల్యే, కొత్తగూడెం జడ్పీ చైర్మెన్ కోరం కనకయ్య ఇటీవల కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. పొంగులేటి ముఖ్య అనుచరుడిగా ముద్రపడిన కనకయ్య ను బీఆర్ యస్ కండువా కప్పాలని ఆ పార్టీ నేతలు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు .ఆయన టికెట్ ఆశిస్తున్నారు , ముందు కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ యస్ లో చేరితే టికెట్ విషయం పరిశీలిస్తాం కానీ గ్యారంటీ ఇవ్వలేమని చెప్పడంతో కనకయ్య పునరాలోచనలో పడినట్లు వినికిడి . అక్కడ ఇల్లందు మాజీ శాసనసభ్యుడు సిపిఐ (ఎం ఎల్ ) గుమ్మడి నర్సయ్య కూతురు ఉస్మానియా లా కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ అనురాధ ను రంగంలోకి దించాలని బీఆర్ యస్ తీవ్ర ప్రయత్నాల్లో ఉంది. అయితే మొదట బీఆర్ యస్ నుంచి పోటీకి నిరాకరించిన ఆమె చివరకు కొంత మెత్తబడ్డారని సమాచారం …ఆమె పోటీలో ఉంటె అంతుకు ముందు తన తండ్రి గుమ్మడి నర్సయ్య కు ఉన్న ట్రాక్ రికార్డు తో సునాయాసంగా గెలవచ్చునని కేసీఆర్ అభిప్రాయపడుతున్నారని తెలుస్తుంది…. మరో రెండు నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థుల ఎంపిక పై ఆలోచనలు జరుగుతున్నాయని అంటున్నారు . అయితే వాటి పేర్లు చెప్పేందుకు బీఆర్ యస్ వర్గాలు నిరాకరిస్తున్నాయి.

పాలేరు , కొత్తగూడెం సీట్లను లెఫ్ట్ పార్టీలు పట్టుబడుతున్నాయి. వారితో పొత్తు ఇంకా ఒక కొలిక్కి రాలేదు ..లెఫ్ట్ పార్టీలతో పొత్తు లేకుంటే ఉమ్మడి ఖమ్మం ,నల్లగొండ జిల్లాలోని మొత్తం 22 నియోజకవర్గాలపై ప్రభావం చూపుతుందని అక్కడ నేతలు కేసీఆర్ పై వత్తిడి తెస్తున్నారని సమాచారం …ఖమ్మం జిల్లాలోని పాలేరు భద్రాచలం,సిపిఎం,కొత్తగూడెం ,వైరా సీట్లను సిపిఐ కోరుతున్నాయి. ఇక్కడ నాలుగు సీట్లతోపాటు నల్లగొండలోని మిర్యాలగూడ ,మునుగుడు ,సిద్ధిపేట జిల్లాలోని హుస్నాబాద్ ,మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి సీట్లపై లెఫ్ట్ పార్టీలుకోరుతున్నాయి…కేసీఆర్ నాన్చుతున్నారు దీనిపై లెఫ్ట్ పార్టీలు గుర్రుగా ఉన్నాయి…

Related posts

బీఆర్ఎస్‌కు మరో షాక్…కాంగ్రెస్ పార్టీలోకి గూడెం మహిపాల్ రెడ్డి

Ram Narayana

పొంగులేటి షాక్ ….ముఖ్య అనుచరుడు డాక్టర్ తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ కు గుడ్ బై …

Ram Narayana

పొరపాటున నోరుజారి కాంగ్రెస్‌కు ఓటేయాలన్న హరీశ్ రావు..

Ram Narayana

Leave a Comment