- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కంపించిన భూమి
- శనివారం సాయంత్రం 2 సెకన్ల పాటు ప్రకంపనలు
- భయాందోళనలకు గురైన ప్రజలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మణుగూరులో శనివారం సాయంత్రం దాదాపు రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఏం జరిగిందో తెలియక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లలో ఉన్నవారు ఏమి జరుగుతుందో తెలియక బయటకు పరుగులు తీశారు …అయితే భూకంప తీవ్రత తక్కువగా ఉండటం ,కేవలం రెండు సెకన్లు మాత్రమే కంపించడంతో ఊపిరి పీల్చుకున్నారు..